AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో మత్తు దందా బట్టబయలు.. మామిడి తోటల మాటున గసగసాల సాగు.. కూపీ లాగుతున్న అధికారులు

ఏపీలో డ్రగ్‌ దందా దుమ్మురేపుతోంది. పబ్బుల్లో, బార్లలోనే కాదు. ఈసారి కొంత వినూత్నంగా పంట పొలాల్లో. అవును... పంట పొలాలు మత్తు మందు తయారీ కేంద్రాలుగా మార్చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు..

ఏపీలో మత్తు దందా బట్టబయలు.. మామిడి తోటల మాటున గసగసాల సాగు.. కూపీ లాగుతున్న అధికారులు
Excise Officers Attck On Cultivation Of Opium Poppy Crop In Chittoor District
Balaraju Goud
|

Updated on: Mar 15, 2021 | 5:56 PM

Share

Poppy Crop in Chittoor district : ఏపీలో డ్రగ్‌ దందా దుమ్మురేపుతోంది. పబ్బుల్లో, బార్లలోనే కాదు. ఈసారి కొంత వినూత్నంగా పంట పొలాల్లో. అవును… పంట పొలాలు మత్తు మందు తయారీ కేంద్రాలుగా మార్చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు.. గసగసాల ముసుగులో నిషేధిత మాదక ద్రవ్యాలు సాగు చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా మారు మూల ప్రాంతంలో సాగుతున్న మత్తు పంట బండారాన్ని బట్టబయలు చేశారు అబ్కారీ అధికారులు. దీని వెనకాల దాగి ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునే పనిలోపడ్డారు అధికారులు.

చిత్తూరు జిల్లా మదనపల్లెలో కోతకు వచ్చిన డ్రగ్స్‌ పంటను ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ అధికారులు బట్టబయలు చేశారు. మామిడి తోటల మాటున గసగసాల పంటను అధికారులు గుర్తించారు. ఓపీఎం పోపీ అని పిలిచే గసగసాలు పంట సాగు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అబ్కారీ అధికారులు దాడులు చేసిన పంటను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ దందా వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా హస్తమున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బెంగళూరు కేంద్రంగా మరో ముఠా సహకరిస్తూ స్థానికంగా పండించేలా ఏర్పాట్లు చేసింది. పొరుగునే ఉన్న కోలారు జిల్లాతో పాటు చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతాల్లో బెంగళూరు ముఠా ఏజెంట్లు వందలాదిమంది ఉన్నట్లు సమాచారం. ఈ దందా ఆరేళ్లుగా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

అసలు ఎలా బయటపడింది

ఇదిలావుంటే, మదనపల్లె పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల అల్లనేరేడు, మొక్కజొన్న, టమాటో పంట మధ్యలో అంతర పంటగా దీన్ని సాగుచేస్తున్నారు. ఎవరికీ తెలికుండా కాయలు దిగుబడి రాగానే కోసి ఎగుమతి చేస్తున్నారు. తాజాగా పదిసెంట్ల పరిధిలో సాగు చేసి ఎగుమతికి సిద్ధంగా ఉన్న కాయలతో పాటు గసగసాల మొక్కల్ని పీకించేసి తగులబెట్టారు అధికారులు. అయితే, భూ యజమాని ఎవరు? పొలంలో పంట వేసిన రైతు ఎవరు? వీరిని ఆ పంట వేయమని సాగు చేయిచిందెవరు? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

నిషేధిత డ్రగ్స్ తయారీకి ఉపయోగించే గసగసాల పంట పండించిన ముగ్గురు రైతులపై కేసులు నమోదు చేశామని స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రోపిక్ సబ్ స్టాన్సెన్స్ యాక్ట్ 1985 కింద కేసులు నమోదు చేశామన్నారు. అయితే, ఈ పంట పండించకూడదన్న విషయం తమకు తెలీదని తమకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు రైతు సంఘాల నాయకులు.

గసగసాల ప్రయోజనాలు

ఇదిలావుంటే, మత్తు పంట గసగసాల సాగుకు భారతదేశంలో అనుమతి లేదు. ఇదీ కేవలం ఆస్ట్రేలియాలోని టాస్మానియా, అమెరికా, యూఏఈలో మాత్రం ఈ సాగు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, పాకిస్తాన్ తదితర దేశాల్లో పెద్ద ఎత్తున సాగవుతోంది. ఇందుకు సంబంధించి గతంలోనే అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. ఈ మొక్క నుంచి గసగసాలతో పాటు కాయ నుంచి జిగురు, బెరడులను కూడా సేకరిస్తారు. కాయ ఏపుగా పెరిగినపుడు దానిపై బ్లేడ్లతో గాట్లు పెట్టి అందులో నుంచి వెలువడే జిగురును సేకరిస్తారు. దీన్ని కొకైన్, హెరాయిన్ తదితరాల తయారీకి ఉపయోగిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఔషధ తయారీ సంస్థ అనుమతులున్న రాష్ట్రాల్లో మాత్రం వీటిని సేకరించి వైద్యపరమైన మత్తు మందులకు వినియోగిస్తారు. నార్కోటిక్ యాక్ట్ ప్రకారం ఈ పంట సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు పోలీసులు.

గతంలో బయటపడ్డ కేసులు

చిత్తూరు జిల్లా మదనపల్లి, చౌడేపల్లి మండలాల్లో 2015లోనూ పట్టుకున్న అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 1985లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా అనుమతి లేకుండా ఓపీఎం పాపీ సాగుచేసినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా, అమ్మినా తీవ్రమైన నేరమవుతుంది. నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ చట్టం ప్రకారం కఠినమైన నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. దోషులుగా తేలితే 10

భారత్‌లో వ్యాపార మార్గాలు మరోవైపు, కర్ణాటకలోని కోలారు, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు ప్రాంతాల్లో బెంగళూరు ముఠాకు చెందిన ఏజెంట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరు కేవలం నాలుగైదేళ్లలో లక్షాధికారులుగా మారారు. బెంగళూరు నుంచి విత్తనాలను స్థానిక రైతులకు అందిస్తున్నారు. తర్వాత సరుకును బెంగళూరుకు చేరవేస్తున్నారు. బెరడు నుంచి పౌడర్‌ను స్థానికంగానే తయా రు చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఇళ్లలోని పెద్ద గ్రైండర్లతో పౌడర్‌ను తయారు చేసి ప్యాకెట్లుగా చేసి బస్సుల్లోనే బెంగళూరుకు పంపుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఏజెంట్ల ద్వారా బెంగళూరులోని ప్రధాన ముఠాను పట్టుకునే పనిలో ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిమగ్నమైనట్లు తెలిసింది. బెంగళూరులోని ముఠాను పట్టుకుంటే అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా లింకులు బయటపడే అవకాశాలున్నాయి.

Read Also : 

Transgenders Join NCC : ఎన్‌సీసీ లోకి ట్రాన్స్‌జెండర్స్‌.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు.. కేంద్రానికి ఆదేశాలు జారీ..