BMC: సేఫ్టీ విషయంలో తగ్గేదే లేదు.. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన నటిపై కేసు..

COVID-19 rules: దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తోంది. మూడు నాలుగు రోజుల నుంచి భారగా కేసులు పెరుగుతున్నాయి. ఈ కేసుల్లో ఎక్కువగా ఒక్క మహారాష్ట్రలోనే 15 వేలకు పైగా కేసులు

BMC: సేఫ్టీ విషయంలో తగ్గేదే లేదు.. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన నటిపై కేసు..
BMC
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 15, 2021 | 9:10 PM

COVID-19 rules: దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తోంది. మూడు నాలుగు రోజుల నుంచి భారగా కేసులు పెరుగుతున్నాయి. ఈ కేసుల్లో ఎక్కువగా ఒక్క మహారాష్ట్రలోనే 15 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం రాష్ట్రంలోని పలుచోట్ల ఆంక్షలు విధించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్డౌన్ అమలవుతోంది. నిబంధనలను ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ప్రభుత్వం స్పష్టంచేసింది. మాస్కులు ధరించాలని కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశాలిచ్చింది. ఆర్థిక రాజధాని ముంబైలో కూడా కరోనా కట్టడికి అటు మహా ప్రభుత్వం.. ఇటు బీఎంసీ కూడా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే కరోనా నిబంధనలను ఉల్లంఘించిన ఓ నటికి బీఎంసీ షాక్ ఇచ్చింది. కోవిడ్‌ నిబంధనల అమలులో రాజీ పడమని… సెలబ్రెటీలు దీనికి మినహాయింపు కాదంటూ బ్రిహాన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సోమవారం కీలక సంకేతాలిచ్చింది.

పరీక్షల్లో పాజిటివ్ అని తేలిన తర్వాత కూడా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన బాలీవుడ్ ప్రముఖ నటి ఒకరిపై బీఎంసీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బీఎంసీ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా వాటిని విస్మరించడం తగదంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. సిటీ భద్రత విషయంలో రాజీ పడేది లేదంటూ పేర్కొంది. కరోనా వచ్చి కూడా నిబంధనలు పాటించని బాలీవుడ్ సెలబ్రెటీ ఒకరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. మహమ్మారిని తరమికొట్టే విషయంలో ప్రజలంతా నిబంధనలు పాటించి సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నామంటూ బీఎంసీ ట్వీట్ చేసి వెల్లడించింది. ఈమేరకు ఎఫ్ఐఆర్ కాపీని కూడా ట్వీట్‌కు జత చేసింది.

అయితే.. ఎఫ్ఐఆర్ కాపీపై ఆ నటి పేరు ఏమిటనేది బ్లర్ చేసి ఉంది. అయితే ఆ నటి గౌహర్ ఖాన్ కావొచ్చని మీడియా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవల బాలీవుడ్‌కు చెందిన చాలా మంది సెలబ్రిటీలు.. రణబీర్ కపూర్, తారా సుతరియా, మనోజ్ భాజ్‌పేయి, అశిష్ విద్యార్థి, సంజయ్ లీలా బన్సాలీ, తదితరులు కరోనా బారిన పడ్డారు. అయితే కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయిన తరువాత నటి గౌహర్‌ ఖాన్‌ ముంబై నుంచి షూటింగ్‌ కోసం ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై సిరీయస్‌ అయిన బీఎంసీ పలు చట్టాల కింద కేసు నమోదు చేసింది. ప్రస్తుతం దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: