AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drunk and Drive: డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరొకరు బలి.. సైకిల్‌పై వెళుతుండగా దూసుకొచ్చిన మృత్యువు

Drunk and Drive in hyderabad: హైదరాబాద్‌లో డ్రంకేశ్వరులు రెచ్చిపోతున్నారు. తాగి రోడ్లపై తిరుగుతూ.. అమాయకులను పొట్టనబెట్టుకుంటున్నారు. నూతన సంవత్సరం

Drunk and Drive: డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరొకరు బలి.. సైకిల్‌పై వెళుతుండగా దూసుకొచ్చిన మృత్యువు
Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 01, 2022 | 3:06 PM

Drunk and Drive in hyderabad: హైదరాబాద్‌లో డ్రంకేశ్వరులు రెచ్చిపోతున్నారు. తాగి రోడ్లపై తిరుగుతూ.. అమాయకులను పొట్టనబెట్టుకుంటున్నారు. నూతన సంవత్సరం రోజున డ్రంక్ అండ్ డ్రైవ్ కు మరొకరు బలయ్యారు. బొటానికల్ గార్డెన్ ఎదుట జరిగిన ప్రమాదంలో ఐటీ ఉద్యోగి నితీన్ మృత్యువాతపడ్డాడు. ఐటీ ఉద్యోగి అయిన నితిన్ తెల్లవారుజామున ఎక్సర్‌సైజ్ కోసం సైకిల్ తొక్కేందుకు బయటికి వచ్చాడు. ఈ క్రమంలో కారులో మద్యం మత్తులో వస్తున్న శశాంక్.. బొటానికల్ గార్డెన్ ఎదుట నితిన్ ను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నితిన్‌కు తివ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన నితిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడినట్లు పోలీసులు తెలిపారు. నితిన్ ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడని తెలిపారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన శశాంక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 120 పాయింట్లు వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా.. ఎయిర్ లైన్స్‌లో క్రూ మెంబర్‌గా పనిచేస్తున్న శశాంక్.. రాత్రి మిత్రులతో కలిసి పార్టీ చేసుకొని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో నితిన్ తోపాటు మరో ముగ్గు స్నేహితులు సైకిల్ పై వెళుతుండగా వెనుకనుండి ఇద్దరికి ఢీకొట్టాడు. అయితే.. నితిన్‌కు తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

Also Read:

Visakhapatnam Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల దుర్మరణం..

Sivakasi Blast: కొత్త సంవత్సరం రోజున తీవ్ర విషాదం.. శివకాశి బాణసంచా కర్మాగారంలో పేలుడు

పోకిరి సినిమాను ఆ హీరో కోసం రాసుకున్న పూరి
పోకిరి సినిమాను ఆ హీరో కోసం రాసుకున్న పూరి
ప్రముఖ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..14మంది సజీవ దహనం..!
ప్రముఖ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..14మంది సజీవ దహనం..!
భర్తతో కలిసి బైక్‌పై వెళుతుండగా.. మెడకు చున్నీ చుట్టుకుపోయి
భర్తతో కలిసి బైక్‌పై వెళుతుండగా.. మెడకు చున్నీ చుట్టుకుపోయి
అయోధ్య రామాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన.. ఎత్తు ఎంతో తెలిస్తే..
అయోధ్య రామాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన.. ఎత్తు ఎంతో తెలిస్తే..
ఢిల్లీ ఆశలను దెబ్బ తీసిన కేకేఆర్.. టాప్-4లో కీలక మార్పులు
ఢిల్లీ ఆశలను దెబ్బ తీసిన కేకేఆర్.. టాప్-4లో కీలక మార్పులు
థియేటర్‏లో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో రచ్చ చేస్తున్న రొమాంటిక్ మూవీ.
థియేటర్‏లో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో రచ్చ చేస్తున్న రొమాంటిక్ మూవీ.
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఐపీఎల్ 2025 మధ్యలో షాకింగ్ న్యూస్.. మరణించిన 34 ఏళ్ల ప్లేయర్..
ఐపీఎల్ 2025 మధ్యలో షాకింగ్ న్యూస్.. మరణించిన 34 ఏళ్ల ప్లేయర్..
శ్రీతేజ్ పూర్తిగా కోలకున్నాడా..? హెల్త్‌ బులిటెన్‌‌లో ఏముందంటే..?
శ్రీతేజ్ పూర్తిగా కోలకున్నాడా..? హెల్త్‌ బులిటెన్‌‌లో ఏముందంటే..?
అక్షయ తృతీయ రోజు షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
అక్షయ తృతీయ రోజు షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?