Sivakasi Blast: కొత్త సంవత్సరం రోజున తీవ్ర విషాదం.. శివకాశి బాణసంచా కర్మాగారంలో పేలుడు
తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శివకాశి బాణాసంచా తయారీ కేంద్రంలో మరోసారి పేలుళ్లు జరిగాయి. బాణాసంచా తయారుచేస్తున్న నలుగురు సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Sivakasi cracker unit blast in Tamil Nadu: తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శివకాశి బాణాసంచా తయారీ కేంద్రంలో మరోసారి పేలుళ్లు జరిగాయి. టపాసుల కేంద్రంలో పెద్ద శబ్ధంతో పేలుడు జరిగింది. పేలుడు ధాటికి భవనం నేలమట్టమైంది. బాణాసంచా తయారుచేస్తున్న నలుగురు సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాద సమాచారం తెలుసుకున్న అధికారులు..వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. క్రాకర్స్ తయారీలో ప్రసిద్ధి చెందిన శివకాశిలో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా సరే, టపాసుల తయారీ కేంద్రాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం లేదు.
విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని ఎం. పుదుపట్టి సమీపంలోని మెట్టుపట్టి గ్రామంలో మురుగన్ పటాకుల ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. శనివారం కొత్త సంవత్సరం రోజున ఎప్పటిలాగే బాణాసంచా ఫ్యాక్టరీలో కార్మికులు విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు పదార్ధాల తయారీ సమయంలో రాపిడి కారణంగా పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ పేలుడు ధాటికి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే దగ్ధమై మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన ముగ్గురు కూలీలను శివకాశి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ఒకరు చనిపోయారు. పేలుడు జరిగిన ఫ్యాక్టరీలో 10కి పైగా గదులు ఉన్నాయి. పేలుడు ధాటికి భవనం పూర్తిగా నేలమట్టం అయ్యింది. కొత్త సంవత్సరం రోజున శివకాశి బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించడం ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
சிவகாசி அருகே பட்டாசு ஆலையில் விபத்து: 4 பேர் பலிhttps://t.co/Gh22YwScwL #sivakasi #fire #Accident
— தினமணி (@DinamaniDaily) January 1, 2022