CALL MONEY APP: అనుమతి లేని యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దు… సైబరాబాద్ సీపీ సజ్జనార్…
ప్రభుత్వం, ఆర్బీఐ అనుమతి లేని రుణాలు మంజూరు చేసే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. రుణం లైసెన్స్ లేకుండా నడిచే ఆన్‌లైన్ రుణ యాప్‌ల వారికి మీ వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలను ఇవ్వొద్దని సూచించారు.

CALL MONEY APP: ప్రభుత్వ, ఆర్బీఐ అనుమతి లేని రుణాలు మంజూరు చేసే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. రుణం లైసెన్స్ లేకుండా నడిచే ఆన్‌లైన్ రుణ యాప్‌ల వారికి మీ వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలను ఇవ్వొద్దని సూచించారు. ఒకవేళ మీరు మీ వ్యక్తిగత సమాచారాన్ని వారికి ఇస్తే వారు మీ స్మార్ట్ ఫోన్‌లోని కాంటాక్ట్స్, ఫైల్స్, గ్యాలరీలను చూసేందుకు ప్రయత్నిస్తారని వివరించారు.
చెక్ చేసుకోండి…
ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల(ఎన్‌బీఎఫ్‌సీ) రిజిస్ట్రేషన్ వివరాలను తెలుసుకోవాలని సూచించారు. ఎవరైనా రుణ యాప్‌ల వేధింపుల బారిన పడితే వెంటనే డయల్ 100 లేదా సైబరాబాద్ వాట్సాప్ 9490617444 లేదా సైబరాబాద్ సైబర్ క్రైం పీఎస్ ఫోన్‌నంబర్ 9490617310కు సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు. ఆర్‌బీఐ వెబ్ సైట్‌లలో https://sachet.rbi. org.in లో రుణయాప్ సంస్థల వివరాలను నమోదు చేసి వాటికి ప్రభుత్వ లైసెన్స్‌లు.. అనుమతులు ఉన్నాయా అని తెలుసుకోవచ్చని చెప్పారు. అనుమానాస్పద యాప్‌లపై https://cms.rbi.org.in లో యాప్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలపై ఫిర్యాదు చేయవచ్చని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.



