కృష్ణా జిల్లాలో మిస్టరీగా మారిన వృద్ధ దంపతుల హత్య కేసు.. ఆధారాల సేకరణలో పోలీసులకు విస్తుపోయే విషయాలు..
కృష్ణా జిల్లా కంచికచర్లలో వృద్ధ దంపతుల హత్య కేసు మిస్టరీగా మారింది. గుర్తు తెలియని దుండగలు ఇద్దరిని హత్య చేసి పరారయ్యారు.
కృష్ణా జిల్లా కంచికచర్లలో వృద్ధ దంపతుల హత్య కేసు మిస్టరీగా మారింది. గుర్తు తెలియని దుండగలు ఇద్దరిని హత్య చేసి పరారయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్‌తో ఆధారాల సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పలు విషయాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ హత్యలు డబ్బుల కోసం చేశారా, లేదంటే మరేదైనా కోణంలో చేశారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకొని పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.