లేడీకిలాడీని పట్టించిన స్టేటస్, అభిరుచులు పంచుకోడానికే కాదు, ఇప్పుడు ఇలానూ పనిచేస్తోన్న వాట్సాప్ స్టేటస్.!
ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం వాట్సాప్ స్టేటస్ తమ తమ అభిరుచుల్ని పంచుకోవడానికే కాదు, తమ వస్తువులు దొంగిలించిన దొంగలెవరో తెల్సుకునేందుకు కూడా..
ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ‘వాట్సాప్’ స్టేటస్ తమ తమ అభిరుచుల్ని పంచుకోవడానికే కాదు, తమ వస్తువులు దొంగిలించిన దొంగలెవరో తెల్సుకునేందుకు కూడా ఉపయోగపడుతోంది. ఇదే ఇప్పుడు గుంటూరు జిల్లా తాడేపల్లిలో దొంగను పట్టిచ్చింది వాట్సాప్ స్టేటస్. స్థానిక డోలాస్ నగర్లోని అపార్ట్మెంట్ లో ఉంటున్న విట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కత్తి అమోగ్ కుంటుంబం జూన్ నెలలో కర్ణాటక వెళ్ళారు. ఆ సమయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంట్లో చోరీ జరిగింది. 45 గ్రాముల బంగారం, ఖరీదైన చీరలు చోరీకి గురయ్యాయి. అయితే, సదరు అపార్ట్మెంట్ లో పని చేసిన సునీత తాజాగా తన ఫోన్ లోని వాట్సాప్ లో స్టేటస్ పెట్టింది. దొంగిలించిన చీరను కట్టుకుని వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడాన్ని గమనించిన బాధిత అసిస్టెంట్ ప్రొఫెసర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సదరు మహిళను అదుపులోకి తీసుకుని లక్షా ఎనభై వేల రూపాయల ఖరీదైన బంగారం, చీరలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇదీ.. బట్టబలైన ఓ లేడీ కిలాడీ కథ.