AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయానికి ఆమోదం తెలిపిన కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ .. 2017-18 ధరల ప్రకారం..

ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయానికి కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయానికి ఆమోదం తెలిపిన కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ .. 2017-18 ధరల ప్రకారం..
uppula Raju
|

Updated on: Dec 27, 2020 | 8:46 AM

Share

ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయానికి కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోతున్న సమయంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్‌గా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుందని అందరు భావిస్తున్నారు. అయితే 2014 ఏప్రిల్‌ 1 నాటికి మిగిలి ఉన్న ఈ ప్రాజెక్టు సాగునీటి విభాగానికి సంబంధించిన 100 శాతం నిధులను కేంద్రమే సమకూర్చుతుందని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతోందని నివేదికలో వెల్లడించింది.

ఇందుకు సంబంధించి కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ నిధుల వివరాలను తెలియజేసింది. 2017-18 ధరల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి రూ. 55వేల 548.87 కోట్ల అంచనా వ్యయానికి ఆమోదముద్ర వేసింది. 2020 ఏడాది పురోగతి నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. 2454 మీటర్ల ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాం, 1128.4 మీటర్ల పొడవైన స్పిల్‌వేతో కూడిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉభయ గోదావరి జిల్లాలు విశాఖ, కృష్ణాజిల్లాల్లో 2.91 లక్షల హెక్టార్లకు సాగునీటితో పాటు ఇతర ప్రయోజనాలు కల్పించాలన్నది లక్ష్యమని మంత్రిత్వ శాఖ నివేదికలో తెలిపింది. 2017-18 నాటి ధరల ప్రకారం ఈ ప్రాజెక్టు ఆమోదిత వ్యయం రూ. 55వేల 548.87 కోట్లు కాగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 8614.16 కోట్లకు పెరిగింది. అందులో రూ.1850 కోట్ల రూపాయలు ఈ ఏడాది జనవరి నుంచి విడుదల అయ్యాయని, దీనికి తోడు 2020-21 ఏడాదిలో రూ.2234 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపింది.

Follow Us
పులి పంజా దెబ్బ ఎట్టుంటుందో తెల్సా..! కొడితే..
పులి పంజా దెబ్బ ఎట్టుంటుందో తెల్సా..! కొడితే..
మీన రాశిలోకి శుక్రుడు.. ఈ రాశులకు చెందిన మహిళలకు అదృష్టం..!
మీన రాశిలోకి శుక్రుడు.. ఈ రాశులకు చెందిన మహిళలకు అదృష్టం..!
బంగారం ధరలపై షాకింగ్ డెసిషన్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్
బంగారం ధరలపై షాకింగ్ డెసిషన్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్
అయ్యో ఎంత విషాదం.. దైవ దర్శనానికి వెళ్తుండగా దారికాచిన మృత్యువు
అయ్యో ఎంత విషాదం.. దైవ దర్శనానికి వెళ్తుండగా దారికాచిన మృత్యువు
కెమికల్స్ అవసరం లేదు!5 నిమిషాల్లో రాగి పాత్రలు మెరిపించే సీక్రెట్
కెమికల్స్ అవసరం లేదు!5 నిమిషాల్లో రాగి పాత్రలు మెరిపించే సీక్రెట్
'దిల్' సినిమా హీరోయిన్ గుర్తుందా? పెళ్లయ్యాక ఇలా మారిపోయిందేంటి?
'దిల్' సినిమా హీరోయిన్ గుర్తుందా? పెళ్లయ్యాక ఇలా మారిపోయిందేంటి?
రాత్రిపూట చపాతీ తింటే నిజంగా బరువు తగ్గుతారా..? అసలు నిజాలు..
రాత్రిపూట చపాతీ తింటే నిజంగా బరువు తగ్గుతారా..? అసలు నిజాలు..
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. అడై దోశ రెసిపీ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. అడై దోశ రెసిపీ
ఫ్యాన్ స్పీడ్ సరిపోవట్లేదా?.. ఒక్కసారి వీటిని చెక్ చేయండి
ఫ్యాన్ స్పీడ్ సరిపోవట్లేదా?.. ఒక్కసారి వీటిని చెక్ చేయండి
ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్..అకౌంట్లలో డబ్బులు జమ!
ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్..అకౌంట్లలో డబ్బులు జమ!