Crime News: మహిళతో యువకుడి సహజీవనం.. తేడా రావటంతో జైపూర్ తీసుకెళ్లాడు.. తర్వాత..
నమ్మి ఓ వ్యక్తితో సహజీవనం చేస్తే ఓ మహిళను హత్య చేసిన ఘటన జైపూర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన గులాబ్ దేవి భర్త అనారోగ్యంతో చనిపోయాడు...

నమ్మి ఓ వ్యక్తితో సహజీవనం చేస్తే ఓ మహిళను హత్య చేసిన ఘటన జైపూర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన గులాబ్ దేవి భర్త అనారోగ్యంతో చనిపోయాడు. భర్త ఉద్యోగం చేస్తున్నపుడే చనిపోవడంతో అధికారులు అతడి స్థానంలో ఆమెకు ఉద్యోగ అవకాశం కల్పించారు. దీంతో ఆమె పిల్లలతో కలిసి ఉద్యోగం చేసుకుంటూ ఢిల్లీలోనే ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత ఆమెకు బాబూలాల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఏదైనా పని ఉంటే బాబూలాల్ గులాబ్ దేవి చేసిపెట్టేవాడు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. మగతోడు ఉంటాడనుకోని ఆమె అతనితో సహజీవనం చేయడం మొదలు పెట్టింది. కొద్ది రోజులు బాగానే సాగిన వీరి సహజీవనంలో గొడవలు మొదలయ్యాయి. దీంతో బాబూలాల్ గులాబ్ దేవిని హత్య చేశాడు.
బాబూలాల్ 2011 సంవత్సరంలో రూ. 22 లక్షలతో ఓ ఇల్లు కొనుగోలు చేశాడు. అతడి వద్ద పూర్తి డబ్బు లేకపోతే గులాబ్ దేవి కొంత ఇచ్చింది. రూ. 22 లక్షల్లో బాబూవి రూ. 17లక్షలు కాగా, గులాబ్ ఐదు లక్షలు సర్దింది. గత రెండు నెలల నుంచి తన కుటుంబంలోని ఒకరిని దత్తత తీసుకోవాలని ఆమె అతడిని పదేపదే అడిగింది. దీంతో బాబూకు తన ఆస్తి తనకు దక్కకుండా పోతుందని భయం పట్టుకుంది. అప్పటి నుంచి గులాబ్‌ను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఆమెను హత్య చేయడానికి నాలుగు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఒక్కడినే హత్య చేయడం కుదరదని భావించి రూ. 2.5 లక్షలకు ఓ ముఠాతో బేరం కుదుర్చుకున్నాడు. మాయమాటలు చెప్పి బాధితురాలిని ఢిల్లీ నుంచి జైపూర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మరో అయిదుగురితో కలిసి ఆమెను హత్య చేశాడు. హత్య తర్వాత శవాన్ని కల్వర్ట్‌లోకి పడేశాడు. అంతేకాకుండా బాబూలాల్ ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. బాధితురాలి బ్యాగ్‌లో ఓ సూసైడ్ నోట్ పెట్టాడు. అందులో తన సోదరులతో ఆస్తి గొడవల వల తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాశాడు. కానీ అనుమానం వచ్చిన పోలీసులు బాబూను అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే ఐదుగురితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
Read Also.. Gun Firing: కార్మికులపై యజమాని కాల్పులు.. కొడుకు తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్.. అసలు ఏం జరిగింది..