Delhi Woman : గర్భం దాల్చడానికి ఈ యువతి ఎంతకు తెగించిందో తెలుసా..! అందరు షాక్ కావాల్సిందే..
Delhi Woman Kills 3-year Old Son : ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన ఓ యువతి గర్భం దాల్చడానికి మూడు సంవత్సరాల బాలుడిని బలి ఇచ్చింది. ఆలస్యంగా
Delhi Woman Kills 3-year Old Son : ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన ఓ యువతి గర్భం దాల్చడానికి మూడు సంవత్సరాల బాలుడిని బలి ఇచ్చింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీలం గుప్తా అనే యువతికి 2013 లో వివాహం అయింది. చాలాకాలమైనా సంతానం కలగడం లేదు. అయితే నాలుగు సంవత్సరాల క్రితం ఉత్తర ప్రదేశ్‌లోని హార్డోయిలోని తన స్వగ్రామమైన గ్రామంలో ఒక మంత్రగాడిని సంప్రదించింది. అతడు గర్భం దాల్చాలనుకుంటే ఓ పిల్లవాడిని బలి ఇవ్వమని సూచించాడు. దీంతో ఆమె పొరుగింటి పిల్లాడు ఒంటరిగా ఆడుకుంటున్నప్పుడు గొంతు కోసి హతమార్చింది. అనంతరం ప్లాస్టిక్ సంచిలో శవాన్ని వేసి ఒక భవనం పైకప్పుపై పడేసింది.
అయితే పిల్లవాడు కనిపించడంలేదని అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పక్కనే ఉన్న ఇంటి పైకప్పుపై ఒక బ్యాగ్ గమనించారు. అది తెరిచి చూడగా అందులో పిల్లాడి మృతదేహం కనిపించింది. బాలుడిని గొంతు కోసి చంపినట్లు సీనియర్ పోలీసు అధికారి ధ్రువీకరించారు. దర్యాప్తులో, కుటుంబ సభ్యులు, బంధువులు మరియు పొరుగువారిని ప్రశ్నించగా, ఆ పిల్లవాడు చివరిసారిగా వారి పొరుగువారిలో ఒకరితో కనిపించాడని తెలిసింది. ప్రశ్నించినప్పుడు, నీలం మొదట్లో పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించింది. కాని తరువాత బాలుడిని చంపినట్లు ఒప్పుకుంది.
అయితే విచారణలో పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. ఆ మహిళ ఈ విధంగా చెప్పింద. తాను గర్భం దాల్చాలనే ఉద్ధేశ్యంతో మానసికంగా చాలా బాధను అనుభవిస్తున్నానని, తన అత్తమామలు, సమాజం తనను పిల్లలు కలగడం లేదని ఎగతాళి చేస్తున్నారని తెలిపింది. అందుకోసం తాను కచ్చితంగా గర్భం దాల్చడానికి ఆ దేవుడిని సంతోపెట్టాలని అనుకున్నానని, మంత్రగాడి సలహా మేరకు పిల్లాడిని చంపానని తెలిపింది.