Cryptocurrency: క్రిప్టోకరెన్సీపై సైబర్‌ నేరగాళ్ల వల.. లాభాల ఆవజూపి మోసం చేస్తున్న కేటుగాళ్లు..

Cybercriminal Network: ఆ కరెన్సీపై బ్యాంకుల నియంత్రణ ఉండదు. చట్టబద్ధత అంతకన్నా లేదు.. అయినా కొందరు కోట్లు పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు. ఆ డిటెయిల్స్‌ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు.

Cryptocurrency: క్రిప్టోకరెన్సీపై సైబర్‌ నేరగాళ్ల వల.. లాభాల ఆవజూపి మోసం చేస్తున్న కేటుగాళ్లు..
Cryptocurrency
Follow us

|

Updated on: Mar 11, 2022 | 7:33 PM

కంటికి అంతా వర్చువల్‌(Virtual )..! బ్యాంకుల నియంత్రణ లేదు. అయినా అత్యాశతో కొందరు క్రిప్టో కరెన్సీలో(Cryptocurrency) కోట్లు పెట్టుబడులు పెట్టి దివాళా తీస్తున్నారు. ఒకటి కాదు..రెండు కాదు..వందల సంఖ్యలో ఇన్వెస్టర్లు మోసపోతున్నారు. లెటేస్ట్‌గా ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో కోటిరూపాయలు పోగొట్టుకున్న హైదరాబాద్‌వాసి లబోదిబోమంటున్నారు. సైబర్‌ నేరగాళ్లకు క్రిప్టోకరెన్సీ వరంగా మారింది. క్రిప్టోలో పెట్టుబడి పెడితే కోట్లలో సంపాదించవచ్చని ఆన్‌లైన్‌లో ఇన్వెస్టర్లకు వల వేస్తున్నారు. హైదరాబాద్‌ కవాడీగూడకు చెందిన శ్రీనివాస్‌ను ఇటీవల ఓ వ్యక్తి టెలిగ్రామ్‌ గ్రూప్‌లో యాడ్‌ చేశారు. ఆ గ్రూప్‌లో నిత్యం క్రిప్టో కరెన్సీపైనే చర్చ జరుగుతుండేది. కొద్దిరోజుల తర్వాత శ్రీనివాస్‌తో మాటలు కలిపిన సైబర్‌ నేరగాళ్లు.. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే కోట్ల రూపాయలు వస్తాయని నమ్మించారు.

కేకాయిన్‌ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న శ్రీనివాస్‌.. లక్షల్లో పెట్టుబడులు పెడుతూ వచ్చాడు. అత్యాశతో మొత్తం 73 లక్షలు పెట్టుబడి పెట్టారు. కొద్దిరోజుల తర్వాత 73 లక్షలకుగానూ శ్రీనివాస్‌ సైట్‌లో 4 కోట్ల రూపాయలు ఉన్నట్లు చూపించింది. ఆ డబ్బును డ్రా చేసుకునేందుకు ప్రయత్నించాడు.

ఎంతకూ డబ్బు ట్రాన్స్‌ఫర్‌ కాకపోవడంతో శ్రీనివాస్‌ సైబర్‌ నేరగాళ్లను నిలదీశాడు. మరింత పెట్టుబడి పెడితే ఒకేసారి కోట్లు తీసుకోవచ్చని చెప్పడంతో తాను మోసోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబర్‌పేటకు చెందిన రాజు, అతని స్నేహితులు, మరో ముగ్గురు క్రిప్టో కరెన్సీలో 28 లక్షల మేరకు పెట్టుబడి పెట్టారు. లాభాలు రాకపోవడం దేవుడెరుగు.. పెట్టిన సొమ్ము కూడా వెనక్కి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు చట్టబద్ధతే లేని క్రిప్టో కరెన్సీపై కేంద్రం 30శాతం ట్యాక్స్‌ విధించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి: CM Yogi: ఏయ్‌ బిడ్డా.. ఇది యూపీ గడ్డ.. యోగి అడ్డా.. 37 ఏళ్ల చరిత్రను తిరగరాసిన బీజేపీ..

G Kishan Reddy: బీజేపీ గెలుపు వెనుక ఆ తెలుగోడు.. గోవాలో చక్రం తిప్పిన కిషన్ రెడ్డి..