AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వలపు వల విసిరి రూ.లక్షలు కాజేసిన నైజీరియన్.. ఫేస్‌బుక్ కథా చిత్రం..

Facebook Love Cheating: చదువుకోని వారు మోసపాయారంటే ఏమో అనుకోవచ్చు. కానీ డిగ్రీలు, పీజీలు చదివిన వారు కూడా లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. అది కూడా ప్రేమ పేరుతో, గిఫ్ట్‌ల మాయతో..

Hyderabad: వలపు వల విసిరి రూ.లక్షలు కాజేసిన నైజీరియన్.. ఫేస్‌బుక్ కథా చిత్రం..
Arrest
Shaik Madar Saheb
|

Updated on: Dec 20, 2021 | 6:58 AM

Share

Facebook Love Cheating: చదువుకోని వారు మోసపాయారంటే ఏమో అనుకోవచ్చు. కానీ డిగ్రీలు, పీజీలు చదివిన వారు కూడా లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. అది కూడా ప్రేమ పేరుతో, గిఫ్ట్‌ల మాయతో.. హైదరాబాద్‌ యువతిని మోసం చేశాడో నైజీరియన్. కస్టమ్స్‌ అధికారిగా ఫోన్‌ చేసి అందినకాడికి దండుకుంటున్నాడు. యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆ నైజీరియన్‌ను అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కి పంపారు. ఈస్ట్‌ మారెడ్‌పల్లికి చెందిన ఓ మహిళకు యూకేకు చెందిన డాక్టర్‌ హెర్మన్‌ లియోన్‌ అనే పేరుతో ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ చేయగా, ఆమెకు హెర్మన్‌ వాట్సాప్‌ నంబర్‌ను ఇచ్చాడు. తక్కువ సమయంలో వీళ్లిద్దరు చాలా దగ్గరయ్యారు. ఇక ఇదే అనుగా భావించిన ఆ ఫ్రాడర్, లేట్‌ చేయకుండా అసలు పని మొదలుపెట్టాడు. యూకే నుంచి 40 వేల పౌండ్ల విలువైన పార్సిల్‌ను బహుమతిగా పంపిస్తున్నానని తెలిపాడు హెర్మన్‌.

పార్సిల్‌ కోసం మనీ లాండరింగ్‌ ఛార్జీలు, ఆదాయ పన్ను, బీమా వంటి రకరకాల ఛార్జీలు చెల్లించాలని చాలా సాఫ్ట్‌గా చెప్పాడు. ఆ మహిళ నుంచి వేర్వేరు ఖాతాలకు 38 లక్షల 57 వేల రూపాయలు వేయించుకున్నాడు. అయితే.. ఎంతకీ ఆ పార్సిల్‌ ఇంటికి రాకపోవటంతో సదరు మహిళకు అనుమానం వచ్చింది. తాను మోసపోయానని తెలుసుకొని గతేడాది మే 27న సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సాంకేతిక ఆధారలను సేకరించి ఢిల్లీలోని జనక్‌పురిలో నివాసం ఉంటున్న నైజీరియన్‌ ఒనేకా సొలమన్‌ విజ్‌డమ్‌ అలియాస్‌ సైమన్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి 7 సెల్‌ఫోన్లు, రెండు బ్యాంక్‌ ఖాతా పుస్తకాలు, ఒక డెబిట్‌ కార్డ్‌ స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్‌ పోలీసులు. ఇలాంటి వారిని నమ్మొద్దని, ముఖ్యంగా యువతులు సోషల్‌మీడియాలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.

Also Read:

Khammam: సాగర్ కాల్వలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి.. ముగ్గురు గల్లంతు..

Afghanistan Heroin: కాబూల్‌ వీధుల్లో యధేశ్చగా మెథామ్‌ విక్రయం.. సంక్షోభం నుంచి బయటపడేందుకు తాలిబన్ల నయా ప్లాన్..