Crime News: టిప్‌టాప్‌గా సూట్‌కేసుతో వచ్చింది.. అది తెరచి చూస్తే అసలు కథ బయటపడింది.. అసలేమైందంటే?

Heroin Hidden In Suitcase: ఇటీవల ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అదేంటంటే, విదేశాల నుంచి భారతీయులు ఓ పధార్థాన్ని భారీగా దిగుమతి చేసుకోవడానికి ఇంట్రెస్ట్‌ చూపుతున్నారట. ఆ పదార్థం ఏంటీ..

Crime News: టిప్‌టాప్‌గా సూట్‌కేసుతో వచ్చింది.. అది తెరచి చూస్తే అసలు కథ బయటపడింది.. అసలేమైందంటే?
Heroin Hidden In Suitcase
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 20, 2021 | 7:47 AM

Heroin Hidden In Suitcase: ఇటీవల ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అదేంటంటే, విదేశాల నుంచి భారతీయులు ఓ పధార్థాన్ని భారీగా దిగుమతి చేసుకోవడానికి ఇంట్రెస్ట్‌ చూపుతున్నారట. ఆ పదార్థం ఏంటీ.. దాని విషయాలు ఎంటో ఇప్పుడు తెలుసుకోండి.. న్యూ ఇయర్‌ వేడుకలు దగ్గరపడుతున్నాయి. దీంతో చాలామంది మత్తులో ఎంజాయ్‌ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఆ మత్తును సొత్తు చేసుకునేందుకు.. కొందరు ప్లాన్ వేస్తున్నారు. ఈసారి ఎంజాయ్‌మెంట్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతోతుందని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆ డిఫరెంట్‌ ఏంటీ అనుకుంటున్నారా? అవును. భారత్‌ నుంచి భారీగా మత్తు పధార్థాలకు ఆర్డర్లు వెళ్లాయనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా.. రాజస్థాన్‌లోని జైపూర్‌ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. షార్జా నుంచి ఎయిర్‌ అరేబియా విమానంలో వచ్చిన ఆఫ్రికన్‌ మహిళ వద్ద 2 కిలోల హెరాయిన్‌ పట్టుబడింది. దీని విలువ 15 కోట్ల వరకు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు చెబుతున్నా, బహిరంగ మార్కెట్‌లో సుమారు 30 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.

చెకింగ్‌ సందర్భంగా మహిళ సూట్‌కేసును తనిఖీ చేయగా, హెరాయిన్‌ లభించినట్టు వివరించారు ఆఫీసర్లు. డ్రగ్‌ డిటెక్టర్‌ను పిలిపించిన కస్టమ్‌ ఇంటెలిజెన్స్‌ వింగ్‌, పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టి, పట్టుబడింది హెరాయిన్‌గా తేల్చింది. సదరు మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కస్టమ్స్‌ అధికారులు. అయితే, ఈ స్థాయిలో హెరాయిన్‌ను ఇంత ఈజీగా సప్లయ్‌ చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఆ మహిళ ఎక్కడి నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చింది? ఎక్కడికి తీసుకెళ్తోంది? ఎవరైనా ఆర్డర్‌ ఇచ్చారా? ఇస్తే ఎవరు ఇచ్చారు? జైపూర్‌కే ఎందుకు వచ్చింది అనే కోణంలో విచారణ చేస్తున్నారు కస్టమ్స్‌ అధికారులు. దీని వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలోనూ కస్టమ్స్‌, డీఆర్‌ఐ అధికారులు ఆఫ్రికన్‌ మహిళను విచారిస్తున్నారు.

Also Read: Bigg Boss 5 Telugu: అలా మాట్లాడినందుకు అందరు నన్ను తిట్టారు.. సిరి తల్లి ఎమోషనల్ ..

Hyderabad: వలపు వల విసిరి రూ.లక్షలు కాజేసిన నైజీరియన్.. ఫేస్‌బుక్ కథా చిత్రం..