AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Animal Cruelty : పండు తిన్నదని ఆవును కత్తితో పొడిచి చంపిన వ్యాపారి.. కోపంలో ఆ పనిచేశానంటూ పశ్చాతాపం

కోపం చిరాకు జీవితంలో భాగం చేసుకుంటూ నిత్యం ఆందోళ వ్యక్తం చేస్తూ అందమైన జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ గడిపేస్తోంది నేటి  తరం.. తాజాగా ఓ పండ్ల వ్యాపారి... చిన్న పండు తిన్నదని కోపంతో అభం శుభం తెలియని సాధు జంతువు ఆవును కత్తితో పొడిచి..

Shocking Animal Cruelty : పండు తిన్నదని ఆవును కత్తితో పొడిచి చంపిన వ్యాపారి.. కోపంలో ఆ పనిచేశానంటూ పశ్చాతాపం
Surya Kala
|

Updated on: Feb 21, 2021 | 12:07 PM

Share

Shocking Animal Cruelty : రోజు రోజుకీ మనుషుల్లో మంచితనం.. మానవత్వం తగ్గిపోతుంది.. సహనం అన్న మాట ఉన్నాదని మరచిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యి హంతకులుగా మారుతున్నారు లేదా ఆత్మహత్యలు చేసుకుని జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు.

కోపం చిరాకు జీవితంలో భాగం చేసుకుంటూ నిత్యం ఆందోళ వ్యక్తం చేస్తూ అందమైన జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ గడిపేస్తోంది నేటి  తరం.. తాజాగా ఓ పండ్ల వ్యాపారి… చిన్న పండు తిన్నదని కోపంతో అభం శుభం తెలియని సాధు జంతువు ఆవును కత్తితో పొడిచి చంపేశాడు.. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

రాయ్‌గడ్ లో మురుడ అనే ప్రాంతంలో తోఫిక్ బషిర్ ముజవార్ అనే వ్యక్తి స్థానికంగా పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఆ ప్రాంతంలో పశువులు ఆహారం కోసం సంచరిస్తుంటాయి. ఈ నేపథ్యంలో బషీర్ ఓ వైపు పండ్లను కొనడానికి వచ్చిన వినియోగదారులను చూసుకుంటూ.. మరోవైపు ఆవులు, అక్కడికి వచ్చే పశువులు బండి మీద ఉన్న పండ్లను తినకుండా చూసుకోవడం ఒక ఎత్తుగా మారింది. ఈ నేపథ్యంలో కస్టమర్లతో మాట్లాడుతున్న సమయంలో ఓ ఆవు బండిలోని బొప్పాయి పండు తింది. దీంతో బషీర్ కోపంతో వెంటనే చేతిలో ఉన్న కత్తితో ఆవు పొట్టలో కసితీరా పొడిచాడు. తీవ్రరక్తస్రావంతో ఆవు అక్కడిక్కడే మరణించింది. ఈ విషయం తెలుసుకున్న ఆవు యాజమాని పండ్ల వ్యాపారిపై పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని రిమాండ్‌కు తరలించారు. అంతకుముందు తాను కావాలని ఈ నేరం చేయలేదని, క్షణికావేశంలో జరిగిపోయిందని విచారణలో భాగంగా అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు.

Also Read:

Follow Us
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!