పెళ్లికి ముందే వీడియో కాల్‌లో వరుడి బాడీ పార్ట్స్ చూడాలని కోరింది.. ఖేల్ ఖతం.. ఆ వ్యక్తికి చుక్కలు

ఓ 33 ఏళ్ల వ్యాపారవేత్త పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోని సైట్‌ను ఆశ్రయించి.. చిక్కుల్లో పడ్డాడు. ఓ కి'లేడీ' అతడిని ట్రాప్ చేసి బెదిరింపులకు పాల్పడి రూ.20,000 వసూలుచేసింది.

పెళ్లికి ముందే వీడియో కాల్‌లో వరుడి బాడీ పార్ట్స్ చూడాలని కోరింది.. ఖేల్ ఖతం.. ఆ వ్యక్తికి చుక్కలు
Follow us
Ram Naramaneni

| Edited By: Ravi Kiran

Updated on: Feb 21, 2021 | 9:01 PM

ఓ 33 ఏళ్ల వ్యాపారవేత్త పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోని సైట్‌ను ఆశ్రయించి.. చిక్కుల్లో పడ్డాడు. ఓ కి’లేడీ’ అతడిని ట్రాప్ చేసి బెదిరింపులకు పాల్పడి రూ.20,000 వసూలుచేసింది. ముందుగా చాటింగ్‌లో మాయమాటలు చెప్పిన ఈ కంత్రీ లేడీ.. ఆ తర్వాత ఆ వ్యక్తి న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడింది.  అడిగినంత డబ్బు ఇవ్వాలని లేకపోతే సదరు వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ అతడిని వేధించింది.

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని సౌత్ బెంగూళూరు హులిమావు ప్రాంతంలోని ఆర్.ఆర్ లేఅవుట్‌లో రాహుల్(పేరు మార్చాం) నివశిస్తున్నాడు. అతను వ్యాపారవేత్త. సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తుంటాడు. అతడు పెళ్లి సంబంధం కోసం ఇటీవల జీవన్ శాంతి అనే మ్యాట్రిమోనీ సైట్‌లో తన వివరాలు నమోదు చేశాడు. ఈ క్రమంలో శ్రేయ అనే అమ్మాయి పేరు నుంచి రిప్లై వచ్చింది. తాను బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో నివశిస్తున్నానని.. మంచి జాబ్ దొరకడం లేదని చెప్పింది. దీంతో రాహుల్ ఆమెకు జాబ్ ఓపెనింగ్స్ సంబంధించిన వివరాలు పంపించాడు. క్రమక్రమంగా వారి రిలేషన్ బలపడింది. పెళ్లైన దంపతుల మాదిరిగానే వారి సంభాషణ సాగేది. ఆడియో, వీడియో కాల్స్ నడిచేవి. కాగా ఫిబ్రవరి 7వ తేదీన వీడియో కాల్ మాట్లాడుతుండగా.. శ్రేయ వింత ప్రతిపాదన చేసింది.

అతడి అన్ని బాడీ పార్ట్స్ నార్మల్‌గా ఉన్నాయో, లేవో చూడాలనుకుంటున్నట్లు చెప్పింది. ఈ క్రమంలో అతడిని నమ్మించేందుకు ముందుగా తన న్యూడ్ ఫోటో సెండ్ చేసింది. దీంతో అతడు కూడా ఓపెన్ అయిపోయాడు. అనూహ్యంగా వీడియో కాల్ ముగించిన కొద్దిసేపటికే.. శ్రేయా నుంచి రాహుల్‌కు నార్మల్ కాల్ వచ్చింది. అంతకుముందు న్యూడ్ వీడియో కాల్ రికార్డ్ చేశానని.. తనకు లక్ష రూపాయల డబ్బు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించింది. దీంతో షాక్‌కు గురైన రాహుల్..తాను అంత అమౌంట్ ఇచ్చుకోలేనని..ఎంతో కొంత ఇస్తాను వీడియో డిలీట్ చేయమని బ్రతిమాలాడు. తొలుత ఫోన్ పే ద్వారా రూ.5000 పంపాడు. ఆ తర్వాత మళ్లీ ఒత్తిడి చేయడంతో మరో రూ.5000 పంపి.. ఆమె నంబర్ బ్లాక్ చేశాడు. దీంతో శ్రేయా ఇతర నంబర్ల నుంచి కాల్ చేసి వేధిస్తుండటంతో మరో రూ.10,000 వేలు సెండ్ చేశాడు. వేధింపులు ఇంకా ఎక్కువవ్వడంతో.. విసిగిపోయిన రాహుల్ పోలీసులను ఆశ్రయించాడు. కి’లేడీ’పై కేసు బుక్ చేసిన పోలీసులు..ఆమె కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కొసమెరుపు ఏంటంటే.. రాహుల్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలియక.. ఆమె డబ్బు కోసం ఇప్పటికీ కాల్స్ చేస్తూనే ఉంది.

Also Read:

తూర్పుగోదావరి జిల్లాలో కలకలం.. వింతవ్యాధితో మేకలు మృత్యువాత.. ‘పొట్ట ఉబ్బి, నురగలు కక్కుతూ’

ముంబై వెళ్లి సినీనటి కావాలనుకున్న ఆరో తరగతి చదువుతున్న బాలిక.. కాకినాడ రైల్వే స్టేషన్‌లో ఏం జరిగిందంటే..?

టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!