తూర్పుగోదావరి జిల్లాలో కలకలం.. వింతవ్యాధితో మేకలు మృత్యువాత.. ‘పొట్ట ఉబ్బి, నురగలు కక్కుతూ’
నిన్న మొన్నటి వరకు ఏలూరు జిల్లాను వింత వ్యాధి వణికించింది. వింత వ్యాధి కారణంగా ప్రజలు బెంబేలేత్తిపోయారు. ఇప్పుడు తాజాగా తూర్పుగోదావరి జిల్లాను
నిన్న మొన్నటి వరకు ఏలూరు జిల్లాను వింత వ్యాధి వణికించింది. వింత వ్యాధి కారణంగా ప్రజలు బెంబేలేత్తిపోయారు. ఇప్పుడు తాజాగా తూర్పుగోదావరి జిల్లాను మరో వింతవ్యాధి వణికిస్తోంది. ఈ వ్యాధి కారణంగా మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గౌరీదేవి పేటలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. స్థానిక మేకల కాపారికి చెందిన 20 మేకలు ఉన్నట్టుండి మృత్యువాత పడ్డాయి. మరో 15 జీవాల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
చనిపోయిన మేకలు..పొట్ట ఉబ్బి, నురగలు కక్కుతూ మరణించినట్లుగా మేకల కాపారులు చెబుతున్నారు. జీవాలకు సోకిన వ్యాధి ఏంటి అనేది అంతుచిక్కకుండా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పశు వైద్యులు సైతం గ్రామాన్ని సందర్శించారు. అంతు చిక్కని వ్యాధిపై ఆరా తీస్తున్నారు.
Also Read: