AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Police Gun Fire: అన్నదమ్ముల్లా కలసి ఉండాల్సిన గ్రామాల మధ్య ‘స్ప్రింగ్ వల’ చిచ్చు.. పోలీసుల కాల్పులు.. పలువురికి గాయాలు!

కలసి మెలసి ఉండాల్సిన మత్య్సకారుల గ్రామాల మధ్య చిచ్చు రగులుతోంది. ఆస్తుల కోసమో, ఆధిపత్యం కోసమో వారు గొడవకు దిగడం లేదు. తమ ఆస్తిగా భావించే వలే వారి మధ్య అగ్ని రాజేసింది.

Police Gun Fire: అన్నదమ్ముల్లా కలసి ఉండాల్సిన గ్రామాల మధ్య ‘స్ప్రింగ్ వల’  చిచ్చు.. పోలీసుల కాల్పులు.. పలువురికి గాయాలు!
Police Gun Fire
Balaraju Goud
|

Updated on: Aug 28, 2021 | 5:41 PM

Share

Controversy over fishing spring nets: కలసి మెలసి ఉండాల్సిన మత్య్సకారుల గ్రామాల మధ్య చిచ్చు రగులుతోంది. ఆస్తుల కోసమో, ఆధిపత్యం కోసమో వారు గొడవకు దిగడం లేదు. తమ ఆస్తిగా భావించే వలే వారి మధ్య అగ్ని రాజేసింది. ఓ రకం వలను ఉపయోగించడాన్ని మరో వర్గం తప్పుపడుతోంది. చేపలు పట్టే చేతులతో ముష్టి యుద్ధాలకు దిగుతున్నారు. తాజాగా పుదుచ్చేరిలో స్ప్రింగ్ వలల వివాదం మత్యకార గ్రామాలలో ఘర్షణలకు దారితీసింది. ఘర్షణలు అదుపుచేయడానికి పోలీుసులు కాల్పులు జరిపారు.

సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్య్సకారుల జీవితాలు.. సముద్ర అలల్లాగే ఉంటాయి. వలలో చేపలు పడితే నోట్లోకి ఐదు వేళ్లు వెళ్తాయి.. లేదంటే పస్తులే.. సముద్రాన్ని నమ్ముకుని, భారాన్ని గంగమ్మపై వేసి, తీరాన్ని వదిలి, కంటికి కనిపించనంత దూరంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల జీవితం దినదిన గండమే. వాతావరణం సహకరిస్తే ఒడ్డుకు చేరుతారు.. లేదంటే జలసమాధి అవుతారు. కుటుంబానికి కడచూపు కూడా దక్కదు.

పుదుచ్చేరిలో మత్స్యకారులు షార్ట్ నెట్‌ల వాడకాన్ని నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, గత కొంతకాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మత్స్యకారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ దశలో, నల్లవాడు వీరంపట్నం మత్స్యకారులు గొడవ చోటుచేసుకుంది. ఇదీ కాస్తా పరస్పరం దాడుల వరకు వెళ్లింది. వీరపట్టినం, నల్లవాడు గ్రామాలలో నివసిస్తున్న మత్యకారులు.. గత కొన్నిరోజులుగా స్ప్రింగ్ వలలపై నెలకొన్ని వివాదం కారణంగా నిరసనలు కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే నల్లవాడు మత్యకారులు స్ప్రింగ్ వలలు వాడకాన్ని నిషేధించాలని నిరసనలకు దిగారు వీరపట్టినం మత్యకారులు. అయితే, నిషేధాజ్ఞలు కాదని చేపలవేటకు వెళ్లిన నల్లవాడు మత్యకారులను వీరపట్టినం మత్యకారులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఒకరి ఫై ఒకరి కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘర్షణలను అదుపుచేయడానికి ప్రయత్నించారు పోలీసులు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. రెండు గ్రామాల మత్స్యకారులను చెదరగొట్టారు.

జాలర్లు వేటకు వాడే వలల్లో చాలా రకాలున్నాయి. అందులో బల్లవల, ఐలవల ముఖ్యమైనవి. బల్లవల తీగల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. అయితే, ఇప్పుడు వివాదానికి కారణమైంది. బల్లవలను వాడటం వల్ల చిన్న చేపలు, గుడ్లు కూడా వలకు చిక్కడంతో మత్స్య సంపద నాశనమవుతోందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. స్ప్రింగ్ వలలు వాడే మత్స్యకార గ్రామాల మధ్య చాలాకాలంగా వివాదాలున్నా ఇటీవల అవి రచ్చకెక్కాయి. దీంతో పుదుచ్చేరి ప్రభుత్వం సైతం స్ర్పింగ్ వలపై ఆంక్షలు విధించింది. మరోవైపు మత్య్సకారుల మధ్య ఈ పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. పోలీసుల జోక్యం చేసుకుని సర్ధిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వినకపోవడంతో పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి రెండు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also…Shocking Video : వీళ్ల పిచ్చి తగలేయా..! లైకుల కోసం ఇలానా.. ఏమాత్రం అంచనా తప్పినా తల పగిలేది.. వీడియో

Child Missing: మార్కాపురం హాస్పిటల్‌లో నాలుగు రోజుల పసికందు అదృశ్యం.. సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలతో పోలీసులు షాక్!