AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Missing: మార్కాపురం హాస్పిటల్‌లో నాలుగు రోజుల పసికందు అదృశ్యం.. సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలతో పోలీసులు షాక్!

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు రోజుల బాబు అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. మార్కాపురం ఏరియా హాస్పిటల్‌లో తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసికందు మాయమైంది.

Child Missing: మార్కాపురం హాస్పిటల్‌లో నాలుగు రోజుల పసికందు అదృశ్యం.. సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలతో పోలీసులు షాక్!
Baby Goes Missing At Markapuram
Balaraju Goud
|

Updated on: Aug 28, 2021 | 4:55 PM

Share

Markapuram Area Hospital: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు రోజుల బాబు అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. మార్కాపురం ఏరియా హాస్పిటల్‌లో తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసికందు మాయమైంది. నాలుగు రోజుల పసికందును గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లింది. ఇందుకు సంబంధించి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. బుర్ఖా వేసుకుని వచ్చిన ఓ మహిళ .. శిశువును అపహరించుకువెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇక, పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాకు చెందిన కోమలి నాలుగు రోజుల క్రితం కాన్పు కోసం మార్కాపురం ఏరియా హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది. ఈ క్రమంలో పడంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఇవాళ కోమలి డిశ్చార్జి కావల్సి ఉండగా, పాప ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో అబ్జర్వేషన్‌లో ఉంచాలంటూ తల్లితో సహా పసికందును ఆస్పత్రి సిబ్బంది ఓ గదిలోకి తీసుకెళ్లారు. కోమలి భర్త శ్రీరాములును భోజనం తెమ్మని పంపించారు. అతను తిరిగి వచ్చేసరికి, తల్లి పక్కన ఉండాల్సిన పాప కనిపించకుండాపోయింది. ఇదే విషయాన్ని వైద్య సిబ్బంది చెప్పడంతో శ్రీరాములు షాకయ్యాడు. ఆసుపత్రి పరిసరాల్లో వెతికినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లి కోమలితో పాటు ఆసుపత్రి సిబ్బందిని పోలీసులు విచారణ జరిపారు. అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు అనుమానితురాలిని గుర్తించారు. ఓ మహిళ బుర్ఖా వేసుకుని పసిపాపను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఈ దిశగా ప్రత్చేక బృందాల సహయంతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

Read Also…  Telangana Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 29, 30 తేదీల్లో తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Praja Sangramam Yatra: టార్గెట్ అసెంబ్లీ ఎన్నికలు 2023..! ప్రజా సంగ్రామ యాత్రతో సమరానికి బండి సంజయ్ శ్రీకారం

Revanth Reddy vs Mallareddy: నేను పాలు, పూలు అమ్మి ఎదిగా.. రేవంత్ రెడ్డి ఎలా ఎదిగాడో చెప్పాలన్న మంత్రి మల్లారెడ్డి