AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy vs Mallareddy: నేను పాలు, పూలు అమ్మి ఎదిగా.. రేవంత్ రెడ్డి ఎలా ఎదిగాడో చెప్పాలన్న మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తాను విసిరిన సవాల్‌కు రేవంత్ రెడ్డి తుస్సుమన్నాడని

Revanth Reddy vs Mallareddy: నేను పాలు, పూలు అమ్మి ఎదిగా.. రేవంత్ రెడ్డి ఎలా ఎదిగాడో చెప్పాలన్న మంత్రి మల్లారెడ్డి
Mallareddy
Venkata Narayana
|

Updated on: Aug 28, 2021 | 3:53 PM

Share

Mallareddy vs Revanth Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తాను విసిరిన సవాల్‌కు రేవంత్ రెడ్డి తుస్సుమన్నాడని ఎద్దేవా చేశారు. కొండను తొవ్వి ఎలుకను పట్టినట్లు.. జిరాక్స్ పేపర్లు తెచ్చి, తనపై భూకబ్జా ఆరోపణలు చేశాడని మండిపడ్డారు. ఏదైనా చెప్తే నమ్మేటట్లు ఉండాలన్న మల్లారెడ్డి.. ఊరికే బుదర జల్లితే సరిపోద్దా..? అని నిలదీశారు. “జవహర్ నగర్లో మొత్తం ప్రభుత్వ భూమే ఉంది.. దేశంలోని చాలా ప్రాంత ప్రజలు సొంత ఇళ్ళులు కట్టుకున్నారు. కనీస మౌలిక వసతులు లేని జవహర్ నగర్ లో టిఆర్ఎస్ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించింది. జవహర్ నగర్ లో 330 ఎకరాలలో పేద ప్రజల ఇళ్ళకు పట్టాలిచ్చాము.” అని మంత్రి చెప్పుకొచ్చారు.

జవహర్ నగర్ లో తన కోడలు పేరు మీద 448 సర్వే నెంబర్ లో 350 గజాల భూమి ఉందని చెప్పిన మంత్రి మల్లారెడ్డి.. జవహర్ నగర్ లో పేద ప్రజలకు హాస్పిటల్ లేదు. అందుకే హాస్పిటల్ నిర్మించామని వివరణ ఇచ్చారు. మెడికల్ కాలేజీ కోసం రోగులు అవసరమని.. స్థానికంగా ఉండే ప్రజలకు మా మెడికల్ కాలేజీ ద్వారా వైద్యం అందిస్తున్నామని మల్లారెడ్డి తెలిపారు. “టీడీపీలో ఎంపీ అయిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు.. 2014 లో మల్కాజిగిరి ఎంపీ సీటు నేను తీసుకున్నాననే కోపంతో రేవంత్ రెడ్డి నా కాలేజీలు మూయిస్తా అని బెదిరించాడు. నేను అప్పుడు చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేశా. ఈ దేశంలో మొదటి గర్ల్స్ కాలేజీ పెట్టింది నేనే. దొంగ కాగితాలు చూపెట్టి నాపై ఆరోపణలు చేస్తున్నాడు. మల్లారెడ్డి కాలేజీలలో ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా? అని మల్లారెడ్డి ప్రశ్నించారు.

“రేవంత్ రెడ్డి పార్లమెంట్లో క్వశ్చన్ అడిగితే.. హెచ్ఆర్డీ మినిస్టర్ ఏంప్రాబ్లమ్ లేదని చెప్పారు. డిఫెన్స్ కమిటీలో ఉండాలని ఎంపీ రేవంత్ రెడ్డికి నేనే సూచించా.. కంటోన్మెంట్లో డిఫెన్స్ కమిటీ పర్యటించినప్పుడు.. ఇక్కడ నివాస స్థలాలు, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయని రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేసాడు.. రేవంత్ రెడ్డి ఇంద్రవెళ్ళి సభకి ప్రేమ్ సాగర్‌ను, ర్యావిరాల సభకు మల్రెడ్డి బ్రదర్స్ ను బలి చేసిండు. మూడు చింతలపల్లి లో వజ్రేష్ యాదవ్‌ను, హరివర్దన్ ను బలిచేసాడు అని మల్లారెడ్డి ఆరోపించారు.

“ఓక్కో మీటింగ్‌కు రేవంత్ రెడ్డి రావాలంటే 50 లక్షలు డిపాజిట్ చేయాలి. మరో సభకు బకరా కోసం నేతను వెతుకుతున్నాడు. చెట్టును, చెరువును చూస్తే కేసీఆర్ గుర్తుకు వస్తాడు. దివాళా తీసిన పార్టీకి రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాడు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్.. కేసీఆర్‌ను తిడితే ప్రజలే బుద్ధి చెపుతారు. గుండ్ల పొచంపల్లిలో 21 ఎకరాలలో నా యూనివర్సిటీ ఉంది. రేవంత్ రెడ్డి 650 సర్వే నెంబర్లో నా యూనివర్సిటీ ఉందని ఆరోపించారు. అసలు 650 సర్వే నెంబర్‌లో నాకు భూమే లేదు. నాకు 600 ఎకరాలకు రైతు బందు వస్తుందని సీతక్క ఆరోపిస్తున్నారు. కాలేజీలు ఉన్న భూమికి రైతు బందు ఎలా వస్తుంది. మీకు తెలియదా.? సీతక్క మంచిదే.. రేవంత్ రెడ్డి మాయ మాటలు చెపుతున్నాడు.” అని మల్లారెడ్డి విమర్శించారు.

“నేను పాలు, పూలు అమ్మి అభివృద్ధి చెందిన.. మరి రేవంత్ రెడ్డి ఏం చేసి సంపాదించిండు.. రేవంత్ రెడ్డి మర్యాద తెలుసుకోవాలి. నేను తలుచుకుంటే రేవంత్ మైండ్ బ్లాక్ అయితది.. రేవంత్ పై నా కామెంట్స్ చూసి.. కాంగ్రెస్ వాళ్ళే నాకు ఫోన్ చేసి మెచ్చుకుంటున్నారు. రేవంత్ కు ఇజ్జత్ ఉంటె హుజూరాబాద్ లో డిపాజిట్ తెచ్చుకోవాలి. నేను సంవంత్సరానికి 2కోట్ల 30 లక్షలు ట్యాక్స్ కడుతున్నా.. రైతు బందు వస్తుందా.. రాదా అనేది నేను చూసుకోలేదు. నా జీతం, నా పీఏల జీతం సామాజిక కార్యక్రమాలకు వాడుతున్నా.. నా పీఏలకు నేనే సొంతంగా జీతం ఇస్తున్నా..” అని మల్లారెడ్డి తెలంగాణ భవన్ లో ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు.

Read also: Auto Driver: సొంత ఆటోను నడిరోడ్డుపై దగ్ధం చేసిన డ్రైవర్.. అందుకేనంటూ హల్‌చల్