Auto Driver: సొంత ఆటోను నడిరోడ్డుపై దగ్ధం చేసిన డ్రైవర్.. అందుకేనంటూ హల్‌చల్
హనుమకొండలోని కాళోజీ సెంటర్లో ఒక ఆటో డ్రైవర్ హల్ చల్ సృష్టించాడు. నడిరోడ్డుపై తన ఆటోకు తానే నిప్పుపెట్టుకుని నిరసన వ్యక్తం చేశాడు.
Hanumakonda: హనుమకొండలోని కాళోజీ సెంటర్లో ఒక ఆటో డ్రైవర్ హల్ చల్ సృష్టించాడు. నడిరోడ్డుపై తన ఆటోకు తానే నిప్పుపెట్టుకుని నిరసన వ్యక్తం చేశాడు. తన నిర్ణయానికి అతను చెప్పిన కారణం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఫేక్ డాక్యుమెంట్స్‌తో తన ఆటోపై ఫైనాన్స్ తీసుకున్న ఓ వ్యక్తి.. పోలీసుల చేత తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆటో డ్రైవర్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే తన ఆటోను దగ్ధం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
వాహనాల రద్దీతో ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో ఆటో తగలబడ్డంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో అలజడి రేగింది. ఏం జరుగుతోందో అర్థం కాక వాహనచోదకులు కంగారుపడ్డారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. పోలీసులు ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
అయితే, ఆటో డ్రైవర్ మాత్రం పోలీసులు తనను తీవ్ర మనస్థాపానికి గురిచేశారని.. అందుకే ఇంతటి పనికి పూనుకున్నానని చెబుతున్నాడు. పోలీసులు అన్యాయంగా పదే పదే తనపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నాడు.
Read also: Cyber Crime: ముగ్గురు నైజీరియన్లు, మణిపూర్‌కు చెందిన ఇద్దరు మహిళల్ని అరెస్ట్ చేసిన కర్నూలు పోలీసులు