Cyber Crime: ముగ్గురు నైజీరియన్లు, మణిపూర్‌కు చెందిన ఇద్దరు మహిళల్ని అరెస్ట్ చేసిన కర్నూలు పోలీసులు

సైబర్ నేరాలకు పాల్పడిన ఆఫ్రికా దేశానికి చెందిన ముగ్గురు నైజీరియన్ల తోపాటు మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళలలను

Cyber Crime: ముగ్గురు నైజీరియన్లు, మణిపూర్‌కు చెందిన ఇద్దరు మహిళల్ని అరెస్ట్ చేసిన కర్నూలు పోలీసులు
Knl
Follow us

|

Updated on: Aug 27, 2021 | 10:23 PM

Cyber Crime: సైబర్ నేరాలకు పాల్పడిన ఆఫ్రికా దేశానికి చెందిన ముగ్గురు నైజీరియన్ల తోపాటు మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళలను కర్నూలు పోలీసులు కొంచెంసేపటి క్రితం అరెస్టు చేశారు. షెల్ ఆయిల్ కంపెనీ, హెర్బల్ ఆయిల్ పేరుతో ఫేక్ ఫేస్ బుక్ ఐడీలతో ఈ ముఠా సభ్యులు మోసాలకు పాల్పడుతున్నారని కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, 2020 సంవత్సరంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన చిదానంద స్వామిని ఫేక్ ఫేస్ బుక్ ఐడీ ద్వారా ముఠా సభ్యులు పరిచయం చేసుకుని వాట్సాప్ చాటింగ్ ద్వారా యుకేలో షెల్ ఆయిల్ కంపెనీ పేరుతో బిజినెస్ చేస్తున్నట్లు చెప్పారు.

వన్ ఫైన్ డే.. ఆయిల్ బిజినెస్‌కు అవసరమైన ముడి సరుకు కోసం పెట్టుబడి పెట్టాలని.. ఫారిన్ కంపెనీ అయినందున తమకు టాక్స్ ఎక్కువగా పడుతుందని కొత్త కహానీ వినిపించారు. చిదానంద స్వామికి ముడి సరుకు కోసం పెట్టుబడి పెడితే ఎక్కవ లాభం ఇస్తామని నమ్మబలికారు. నమ్మిన చిదానంద స్వామి 11 లక్షల 24 వేల రుపాయలు డిపాజిట్ చేసి మోస పోయాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు ఈ కేసులోని ముద్దాయిల కొరకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకొని ఢిల్లీలో పట్టుకున్నారు. వీరిలో ఒకరికి పాస్ పోర్టు లేదని.. మరొకరికి పొస్ పోర్టు గడువు ముగిసిందని ఎస్పీ తెలిపారు. వీరి నుండి 16 బ్యాంకు అకౌంట్స్ బుక్స్, 33 ఏటీఎం కార్డులు, 4 ఫారిన్ పాస్ పోర్ట్స్ స్వాధీనం చేసుకున్నారు.

Read also: Anantapuram: అనంతపురం జిల్లా కొండూరులో శవం కన్నీరు!!!