Chevella Road Accident: బర్త్‌డే కేక్‌ కొన్న ఆనందంలో ఆ ముగ్గురు చిన్నారులు తిరిగి ఇంటికి బయల్దేరారు.. అంతలోనే..

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈ విషాదం చోటు చేసుకుంది. పుట్టిన రోజు వేడుకలకు కేక్‌ కోసమని వెళ్లారు. కేక్ కొనుక్కున్నారు. తిరిగి

Chevella Road Accident: బర్త్‌డే కేక్‌ కొన్న ఆనందంలో ఆ ముగ్గురు చిన్నారులు తిరిగి ఇంటికి బయల్దేరారు.. అంతలోనే..
Road Accident
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 27, 2021 | 10:02 PM

Chevella Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈ విషాదం చోటు చేసుకుంది. పుట్టిన రోజు వేడుకలకు కేక్‌ కోసమని వెళ్లారు. కేక్ కొనుక్కున్నారు. తిరిగి ఇంటికెళ్తుండగా ప్రమాదం జరిగింది. వాళ్లు వెళ్తున్న టూవీలర్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారు. జయవర్దన్, విష్ణు, వరప్రసాద్‌గా వారిని గుర్తించారు.

బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య.. కర్రతో తలపై కొట్టి నగలు చోరీ

విజయవాడ నగర శివారు కుందావారి కండ్రిగ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బంగారం కోసం ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి హతమార్చారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుబ్బమ్మ అనే వృద్ధురాలు స్థానిక సిండికేట్‌ బ్యాంకు సమీపంలో ఉంటుంది. భర్త, పెద్ద కుమారుడు చనిపోవడంతో చిన్న కుమారుడు వెంకటరెడ్డి, ఇతర బంధువులు మరో వీధిలో ఉంటున్నారు. అయితే తను ఒంటరిగా ఇంట్లో ఉంటూ పక్క గదిని వేరేవారికి అద్దెకు ఇచ్చింది. గురువారం సాయంత్రం అద్దెకు ఉంటున్న వారు బయటకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది.

ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి సుబ్బమ్మ మెడలోని సుమారు 5 తులాల బంగారు గొలుసు దోచుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె ప్రతిఘటించడంతో తలపైన, ఇతర శరీర భాగాలపై కర్రతో, రాడ్డుతో బలంగా కొట్టడంతో మంచంపై పడిపోయింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో అద్దెకు ఉంటున్న వారు తిరిగి రాగా.. రక్తపు మడుగులో వృద్ధురాలిని గుర్తించారు. బంధువుల సాయంతో కొనఊపిరితో ఉన్న ఆమెను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఘటనాస్థలాన్ని ఏడీసీపీ లక్ష్మీపతి, నార్త్‌ డివిజన్‌ ఏసీపీ షేక్‌ షాను పరిశీలించారు. సీసీఎస్‌, వేలిముద్రల నిపుణులు ఆధారాలు సేకరించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నున్న సీఐ హనీష్‌బాబు తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్డు, రోకలిబండను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు. కాగా కుటుంబ సభ్యులు సుబ్బమ్మకు ఎవరితో విభేదాలు లేవని తెలిపారు. నిందితుడిని పట్టుకొని తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.

Read also: Anantapuram: అనంతపురం జిల్లా కొండూరులో శవం కన్నీరు!!!