Anantapuram: అనంతపురం జిల్లా కొండూరులో శవం కన్నీరు!!!

అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కొండూరులో దారుణం చోటు చేసుకుంది. పూడ్చడానికి స్థలం లేదంటూ శవంతో పాటు

Anantapuram: అనంతపురం జిల్లా కొండూరులో శవం కన్నీరు!!!
Dead Body
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 27, 2021 | 9:48 PM

Graveyard – Dead body: అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కొండూరులో దారుణం చోటు చేసుకుంది. పూడ్చడానికి స్థలం లేదంటూ శవంతో పాటు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ అధికారుల దగ్గరికి వెళ్లారు బాధితులు. పోలీస్ వార్నింగులు సైతం లెక్క చేయకుండా వర్షంలోనే తడుస్తూ శవంతో ధర్నా చేశారు. వివరాల్లోకి వెళ్తే, లేపాక్షి మండలం కొండూరు గ్రామంలో కొండప్ప అనే వ్యక్తి అనారోగ్యంతో గత రాత్రి మృతి చెందాడు. 80 ఏళ్లగా వాడుకుంటున్న స్మశానవాటికలో తమకు పట్టాలు ఉన్నాయంటూ కొంతమంది అంత్యక్రియలకు అడ్డు చెప్పారు.

కాగా, సదరు 80 సెంట్ల స్థలంలో ఓ సామాజిక వర్గం ఏళ్ల తరబడి స్మశానంగా వాడుకుంటున్నారు. గతంలో పనిచేసిన ఒక తాసిల్దార్ 80 సెంట్ల స్థలంలో కొంత భాగాన్ని అదే గ్రామానికి చెందిన కొంతమందికి పట్టాలు ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఆ స్థలం వివాదస్పదంగా మారిపోయింది. మనుషులు చనిపోతే శవాలను పూడ్చ రాదంటూ అడ్డుకోవడం ఇదేం సంస్కృతి అంటూ బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

చేసేదిలేక గ్రామం నడిబొడ్డన జోరువాన సైతం లెక్కచేయకుండా శవంతో ధర్నాకు దిగారు మృతుడి తరపు బంధుమిత్రులు. సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో కొండూరు నుండి లేపాక్షి తాసిల్దార్ కార్యాలయం వరకు సుమారు ఆరు కిలోమీటర్లు శవాన్ని మోసుకొచ్చి రెవెన్యూ కార్యాలయం నిరసన ప్రదర్శన నిర్వహించారు. కబ్జాకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం నాయకులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Dead Body Dharna

Dead Body Dharna

Read also: Veeramachaneni: డయాబెటిక్ డైట్ విషయంలో వీరమాచనేనికి విజ్ఞాన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్