AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా స్పెషల్‌ ట్రైన్‌లో కోట్ల విలువైన సిగరెట్లు స్వాధీనం

ఓ వైపు కరోనాతో యావత్ ప్రపంచ వణికిపోతుంటే.. మరోవైపు స్మగ్లర్లు మాత్రం వారి దందాలను యథేచ్చగా చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పట్టుబడుతున్న గోల్డ్ స్మగ్లర్లు, డ్రగ్స్ మాఫయాను చూస్తే అర్ధమవుతోంది. తాజాగా..

కరోనా స్పెషల్‌ ట్రైన్‌లో కోట్ల విలువైన సిగరెట్లు స్వాధీనం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 10, 2020 | 7:42 PM

Share

ఓ వైపు కరోనాతో యావత్ ప్రపంచ వణికిపోతుంటే.. మరోవైపు స్మగ్లర్లు మాత్రం వారి దందాలను యథేచ్చగా చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పట్టుబడుతున్న గోల్డ్ స్మగ్లర్లు, డ్రగ్స్ మాఫయాను చూస్తే అర్ధమవుతోంది. తాజాగా.. దేశ రాజధాని ఢిల్లీలో భారీగా సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. దాదాపు కొటిన్నరకు పైగా వీటి విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. యూపీలోని వారణాసి, ఢిల్లీ మధ్య నడిచే కరోనా స్పెషల్ ట్రైన్‌లో భారీగా సిగరెట్లను రవాణ చేస్తుండగా గుర్తించామని అధికారులు తెలిపారు. తమకు దీనిపై పక్కా సమాచారం అందడంతో అప్రమత్తమై.. స్పెషల్ టీంలు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టామన్నారు. వంద పెట్టెల్లో ప్యాక్ చేసిన రూ.1.2 కోట్ల విలువైన పది లక్షల సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు మరో బ్యాగులో రూ.36 లక్షల విలువైన 9 లక్షల సిగరెట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే ఒకర్ని అరెస్ట్ చేశామని.. ఈ ముఠాకు ఆరా తీస్తున్నామన్నారు.

Another seizure of around 9 lakhs cigarettes, valued at around Rs 36 Lakhs, was also done from the same train. These were concealed in 38 big gunny bags. A person linked with the two consignments has been held and is being questioned. Further investigation is in progress. https://t.co/G6hoV6tvso

— ANI (@ANI) July 10, 2020