Breaking : ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి పితాని పీఎస్ అరెస్ట్

ఈఎస్ఐ స్కాం కేసు మరో మలుపు తిరిగింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురిళీని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

Breaking : ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి పితాని పీఎస్ అరెస్ట్
Follow us

|

Updated on: Jul 10, 2020 | 7:10 PM

ఈఎస్ఐ స్కాం కేసు మరో మలుపు తిరిగింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీమోహన్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకొన్నారు. సచివాలయంలో ఇవాళ విధుల్లో ఉన్న ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో కొవిడ్ టెస్ట్ తో పాటు వైద్య పరీక్షలు చేయుంచిన అనంతరం మురళీని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. కాసేపట్లో మురళీని ఏసీబీ కోర్టు లో హాజరుపరిచే అవకాశమున్నట్లు సమాచారం. అయితే, ఇదే కేసుకు సంబంధించి పితాని సత్యనారాయణ కుమారుడికి కూడా సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ అధికారుల విచారణ లో మురళీ నోరు విపితే అసలు విషయాలు బయటకు రావచ్చని భావిస్తున్నారు. మరోవైపు మురళి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిసన్ వేశారు. ఈ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

ఈఎస్‌ఐ స్కాంలో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా పదిమందికిపైగా అరెస్ట్‌లు జరిగాయి. ఈ కేసులో ఏసీబీ అధికారులు పలువుర్ని కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో మాజీ మంత్రి పితాని కుమారుడు, పీఎస్ పాత్ర ఉందని ప్రచారం జరిగింది. ఇప్పుడు పీఎస్‌ను అరెస్ట్ చేయడం.. సురేష్ కోసం ఏసీబీ గాలిస్తున్నట్లు సమాచారం.