చిత్తూరులో మెడికో అదృశ్యం..4రోజుల క్రితమే ఫిర్యాదు

చిత్తూరు జిల్లాలో మెడికో అదృశ్యం కలకలం రేపుతోంది. విద్యార్థి కనిపించకపోవటంతో తల్లిదండ్రులు బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిత్తూరులో మెడికో అదృశ్యం..4రోజుల క్రితమే ఫిర్యాదు
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 23, 2020 | 6:44 PM

చిత్తూరు జిల్లాలో మెడికో అదృశ్యం కలకలం రేపుతోంది. విద్యార్థి కనిపించకపోవటంతో తల్లిదండ్రులు బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆచూకీ లభించకపోవటంతో కుటుంబీకులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలు పరిశీలించగా..

నెల్లూరు జిల్లా కావలి మండలం మూసనూరు గ్రామానికి చెందిన మనోజ్ అనే యువకుడు..చిత్తూరు జిల్లా కుప్పంలో మెడిసిన్ చదువుతున్నాడు. పీఈఎస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతున్న మనోజ్..స్థానికంగా ఓ ప్రైవేట్ లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకుని చదువు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ, ఉన్నట్టుండి మనోజ్ కనిపించకుండా పోయాడు. దీంతో మనోజ్ కుటుంబీకులు, స్నేహితులు, బంధువులందరినీ ఆరా తీశారు. అయినా ఎటువంటి సమాచారం తెలియకపోవటంతో నాలుగు రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 18 నుంచి మనోజ్ కనిపించడం లేదంటూ కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. అయితే, మనోజ్ కు అప్పులు ఉన్నట్లుగా సమాచారం.