రోడ్డు ప్రమాదం: చిరంజీవి చిన్ననాటి స్నేహితుడి కుటుంబం దుర్మరణం

సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి బాల్య స్నేహితుడి కుటుంబం దుర్మరణం పాలైంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగర్తిపాలేనికి చెందిన మైలాబత్తుల సత్యానందం..హీరో చిరంజీవికి స్నేహితుడు. వారిద్దరూ

రోడ్డు ప్రమాదం: చిరంజీవి చిన్ననాటి స్నేహితుడి కుటుంబం దుర్మరణం
Jyothi Gadda

|

Jun 27, 2020 | 12:58 PM

సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి బాల్య స్నేహితుడి కుటుంబం దుర్మరణం పాలైంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగర్తిపాలేనికి చెందిన మైలాబత్తుల సత్యానందం..హీరో చిరంజీవికి స్నేహితుడు. వారిద్దరూ నరసాపురం వైఎన్ కళాశాలలో డిగ్రీ కలిసి చదువుకున్నారు. ఇరువురు ఎంతో స్నేహంగా మెలిగేవారట‌. ఇద్ద‌రు చిన్నప్ప‌టి నుంచి క్లాస్ మేట్స్ అట‌. అప్ప‌టి నుంచి ఇద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. అటుపై చిరంజీవి సినిమాల్లోకి రావ‌డం, స‌త్యానందం రాజ‌మండ్రి డిగ్రీ క‌ళాళాల‌లో అధ్యాప‌కుడిగా వెళ్లిపోయారట‌. అలా చిరంజీవి-స‌త్యానందం మ‌ధ్య దూరం పెరిగిన‌ట్లు తెలుస్తోంది.

మైలాబత్తుల సత్యానందం రాజమండ్రి డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన భార్య విజయకుమారి కూడా ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. వీరికి కుమారుడు జోసెఫ్‌, కుమార్తె ఉన్నారు. విజయకుమారి అనారోగ్యంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం సత్యానందం, జోసెఫ్‌తో కలిసి కారులో శుక్రవారం తెల్లవారుజామున విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యలో సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరు ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu