సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక పోస్టులు.. కాంగ్రెస్ నేత అరెస్ట్..

కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, పార్లమెంటరీ మాజీ చీఫ్ సెక్రటరీ నీరజ్‌ బారతిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ..

సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక పోస్టులు.. కాంగ్రెస్ నేత అరెస్ట్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 27, 2020 | 3:58 PM

కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, పార్లమెంటరీ మాజీ చీఫ్ సెక్రటరీ నీరజ్‌ బారతిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ.. పలు అభ్యంతరకర పోస్టులు పెట్టడంతో ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటన హిమాచల్‌ ప్రదేశ్‌లో శుక్రవారం నాడు చోటుచేసుకుంది. ఇటీవల లదాఖ్‌లోని గాల్వాన్‌ లోయలో చోటుచేసుకున్న ఘటనపై కేంద్ర ప్రభుత్వాన్ని, దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు అక్కడ పెనుదుమారాన్ని రేపాయి. నీరజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై సిమ్లాకు చెందిన న్యాయవాది నరేంద్ర గులేరియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత నీరజ్‌ రాజద్రోహానికి పాల్పడ్డారని.. అసభ్య పదజాలాన్ని వాడుతూ.. దేశ ప్రజల్లో విద్వేశాన్ని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు.. కాంగ్రెస్ నేత నీరజ్ భారతిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.