షాకింగ్‌.. రూ.65 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత.. నిందితులకు ఉగ్ర లింకులు..

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో అతిపెద్ద టెర్రర్ మాడ్యుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు నార్కోటిక్ డ్రగ్స్‌ను సప్లై చేస్తూ.. లోయలో ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు.

షాకింగ్‌.. రూ.65 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత.. నిందితులకు ఉగ్ర లింకులు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 27, 2020 | 4:30 PM

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో అతిపెద్ద టెర్రర్ మాడ్యుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు నార్కోటిక్ డ్రగ్స్‌ను సప్లై చేస్తూ.. లోయలో ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు. భారత ఆర్మీ, కుప్వారా పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి.. ఈ ముఠాను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 13.5 కిలోల మాదక ద్రవ్యాలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ రూ.65 కోట్లుకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులను మంజూర్ అహ్మద్‌ లోనే, జీహెచ్‌ మోహ్మద్ లోనే గా గుర్తించారు. వీరు బారాముల్లా జిల్లాలోని బిజ్మా, లచీపొరా ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరి వద్ద నుంచి రెండు తుపాకీలను, నాలుగు మ్యాగజైన్లు, 55 బుల్లెట్లు, నాలుగు హ్యాండ్‌ గ్రేనేడ్లు, పది డిటోనేటర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరు పీవోకేలో ఉంటున్న పలువురు ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వీరు ఉగ్రవాదులకు డ్రగ్స్‌, ఆయుధాలను సప్లే చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.