వరవరరావుకు ముంబై కోర్టు షాక్..
విరసం నేత వరవరరావుకు ముంబై కోర్టు మళ్లీ షాకిచ్చింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను ముంబై కోర్టు తిరస్కరించింది. ఆయన అనారోగ్యంతో ఉన్నారని..
విరసం నేత వరవరరావుకు ముంబై కోర్టు మళ్లీ షాకిచ్చింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను ముంబై కోర్టు తిరస్కరించింది. ఆయన అనారోగ్యంతో ఉన్నారని.. అందుకు బెయిల్ ఇవ్వాలంటూ వరవరరావు తరపు లాయర్లు కోర్టును కోరారు. అయితే బెయిల్ ఇవ్వద్దంటూ ఎన్‌ఐఏ కోర్టును కోరింది. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు కీలక నిందితుడని.. ఎన్ఐఏ కోర్టుకు వివరించింది. దీంతో ఎన్ఐఏ పేర్కొన్న వాటితో ఏకీభవించి.. వరవరరావు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. కాగా, ప్రధాని మోదీ హత్యకు కుట్రపన్నారన్న ఆరోపణలతో వరవరరావును ఎన్‌ఐఏ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.