ఏకంగా ముఖ్యమంత్రి తండ్రినే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎక్కడ..? ఎందుకు..? పూర్తి వివరాలు

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Sep 07, 2021 | 6:01 PM

చట్టం దృష్టిలో అందరూ సమానమే అని మరోసారి రుజువైంది. ముఖ్యమంత్రి అయినా, సీఎం తండ్రి అయిన ఒక్కటే అని స్పష్టమైంది.

ఏకంగా ముఖ్యమంత్రి తండ్రినే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎక్కడ..? ఎందుకు..? పూర్తి వివరాలు
Nand Kumar Baghel

Follow us on

Chhattisgarh CM’s father arrested: చట్టం దృష్టిలో అందరూ సమానమే అని మరోసారి రుజువైంది. ముఖ్యమంత్రి అయినా, సీఎం తండ్రి అయిన ఒక్కటే అని స్పష్టమైంది. తాజాగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ తండ్రి నంద కుమార్ బాఘెల్‌ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. బ్రాహ్మణులను అవమానించారని ఆయనపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు రాయ్‌పూర్ కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

నంద కుమార్ (86) తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని అంతకుముందు బ్రాహ్మణులు రాయ్‌పూర్‌లోని డీడీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్రాహ్మణులు బయటివారని, విదేశీయులని, వారు తమను తాము సంస్కరించుకోవాలని, లేదంటే గంగ నుంచి వోల్గాకు వెళ్లడానికి సిద్ధం కావాలని నంద కుమార్ అన్నారని బ్రాహ్మణ సమాజం నేతలు ఆరోపించారు. దీంతో రాయ్‌పూర్ పోలీసులు నంద్ కుమార్ బాఘెల్‌‌పై కేసు నమోదు చేసిచ అరెస్టు చేసి కోర్టుకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతోంది.

డీడీ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి యోగిత కపర్దే మాట్లాడుతూ, నంద కుమార్ సమాజంలో విద్వేషాలను వ్యాపింపజేస్తున్నారని, ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని బ్రాహ్మణులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆయన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు.

నంద కుమార్ అరెస్టుపై ముఖ్యమంత్రి భూపేష్ స్పందిస్తూ తనకు తన తండ్రి అంటే గౌరవం ఉందన్నారు. అయితే తన ప్రభుత్వంలో ఎవరూ చట్టానికి అతీతులు కాదని చెప్పారు. ఓ కుమారునిగా తాను తన తండ్రిని గౌరవిస్తానన్నారు. కానీ ప్రజా భద్రతకు భంగం కలిగించే ఆయన పొరపాట్లను ఉపేక్షించరాదని చెప్పారు. “నేను నా తండ్రిని కొడుకుగా గౌరవిస్తాను, కానీ ముఖ్యమంత్రిగా, ప్రజా ఆర్డర్‌ని దెబ్బతీసే అతని తప్పులు ఏవీ విస్మరించను. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ, మా ప్రభుత్వంలో ఎవరూ చట్టానికి అతీతులు కారు. “అని భూపేష్ బాఘెల్ అన్నారు.

Read Also….  NRI Doctor: వీడిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సోదరుడి మిస్సింగ్ మిస్టరీ.. అమెరికా ఫ్లైట్ ఎక్కాల్సిన డాక్టర్.. నీళ్ల కుంటలో శవం అయ్యారు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu