AP Crime News: మొద‌ట న‌మ్మించారు.. ఆ త‌ర్వాత న‌ట్టేట ముంచారు.. లక్కీ లాటరీ పేరుతో బురిడీ..

బంగారం కావాలా... ఇల్లు కావాలా.. బైక్ కావాలా.. ఎలక్ట్రానిక్ వస్తువులు కావాలా.. ఏదైనా సరే అదృష్టం పరీక్షించుకోండి. తగిలితే భాగ్యలక్ష్మి బంపర్ డ్రానే. ఇలానే...

AP Crime News:  మొద‌ట న‌మ్మించారు.. ఆ త‌ర్వాత న‌ట్టేట ముంచారు.. లక్కీ లాటరీ పేరుతో బురిడీ..
Fraud
Follow us
Ram Naramaneni

|

Updated on: May 01, 2021 | 3:40 PM

బంగారం కావాలా… ఇల్లు కావాలా.. బైక్ కావాలా.. ఎలక్ట్రానిక్ వస్తువులు కావాలా.. ఏదైనా సరే అదృష్టం పరీక్షించుకోండి. తగిలితే భాగ్యలక్ష్మి బంపర్ డ్రానే. ఇలానే ఆఫర్ చేసింది ఓ కంపెని. ఇంకేముంది ఆలస్యం చేసినా ఆశాభంగం అంటూ వేలకు వేలు తగలబోశారు.. అది కోట్లకు చేరింది. వన్‌ ఫైన్ డే బోర్డు తిప్పేసి పరారయ్యారు. ఇది అనంతపురం జిల్లా హిందూపురం కేంద్రంగా స్కీం పేరుతో సాగిన నయా మోసం.

హిందూపురం పట్టణం.. ఇక్కడ లక్కీ డిప్ పేరుతో జరిగే స్కీమ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఆ స్కీమ్ లోని వారే బాధితులుగా మారారు. హిందూపురం ఆబాదిపేటకు చెందిన షానూర్, బెంగళూరుకు చెందిన ఇర్షాద్ తో కలిసి రెండేళ్ల కిందట ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్ అడ్వైజర్ గ్రూప్స్ పేరిట హిందూపురంలో కార్యాలయం ప్రారంభించారు. వీరు ఓ సరికొత్త స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చారు. అది ఏంటంటే… ఐఎన్ఏ కంపెనీలో… ఇల్లు /ఫ్లాట్, బంగారు నగలు, బైక్ లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, నగదు రెట్టింపు చెల్లింపు తదితర బంపర్ ఆఫర్ల పేరిట లక్కీ డిప్ స్కీం ఉంటుంది. స్కీంలో చేరాలనుకునే వారు 200 రూపాయలు సభ్యత్వ రుసుం చెల్లించాలి. ఎంచుకున్న స్కీంలను బట్టి 20 నెలల నుంచి 40నెలల వాయిదాలు కట్టాలి. ప్రతి నెలా పదో తేదీ లోపు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు వాయిదా మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెలా 15వ తేదీన లక్కీ డ్రా తీస్తారు. మొదటి బహుమతి కింద రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్, రెండో బహుమతి కింద యాక్టివా, మూడో బహుమతిగా పది గ్రాముల బంగారం నాలుగో బహుమతిగా ఎనిమిది గ్రాముల బంగారం, ఐదో బహుమతిగా 32 ఇంచ్ ఎల్‌ఈడీ టీవీ లేదా కట్టిన మొత్తానికి 50 శాతం అదనంగా చెల్లిస్తామని బ్రోచర్లు ముద్రించారు.

ఐఎన్‌ఏ ఆఫర్లు ఆకట్టుకోవడంతో హిందూపురం పట్టణంతో పాటు లేపాక్షి, గోరంట్ల, పరిగి తదితర ప్రాంతాలకు చెందిన 3వేల మంది వివిధ స్కీముల్లో సభ్యులుగా చేరారు. మొదట్లో వాయిదాలు పూర్తి చేసిన వారికి ఆమేరకు నగదు చెల్లించారు. దీంతో స్కీంపై మిగిలిన వారికి నమ్మకం కలిగింది. అలా స్కీం వ్యాపారం టర్నోవర్ కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో నిర్వాహకులిద్దరూ కొంతకాలంగా కనిపించకుండా పోయారు. తాము నిలువునా మోసపోయామని గ్రహించిన బాధితులు న్యాయం చేయాలని వటౌన్ పోలీసులను ఆశ్రయించారు. డబ్బు కట్టించుకున్న నిర్వాహకులు పత్తా లేకపోవడంతో లక్కీ డిప్ మాట దేవుడెరుగు.. కనీసం కట్టిన డబ్బు కూడా వెనక్కు వచ్చే మార్గం కనిపించక లబోదిబోమంటున్నారు.

Also Read: మంత్రి ఈటల రాజేందర్‌పై వేటుకు రంగం సిద్ధం.. వైద్య ఆరోగ్యశాఖను కేసీఆర్‌కు బదిలీ.. గవర్నర్‌ ఆమోదం

భారత్‌‌లో కరోనా అల్లకల్లోలం.. ప్రపంచంలో తొలిసారిగా.. 4 లక్షలకు పైగా కేసులు..