భవ్యాస్ బిల్డర్స్ అధినేత ఆనంద్ ప్రసాద్‌పై చీటింగ్ కేసు.. పరారీలో ఉన్న ప్రసాద్ కోసం పోలీసుల వేట..!

చీటింగ్‌ కేసులో భవ్యాస్‌ బిల్డర్స్‌ అధినేత ఆనంద ప్రసాద్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన కుమారుడు, కోడలిని అదుపులోకి తీసుకుని.. ఆయన కోసం కూపీ లాగుతున్నారు.

భవ్యాస్ బిల్డర్స్ అధినేత ఆనంద్ ప్రసాద్‌పై చీటింగ్ కేసు.. పరారీలో ఉన్న ప్రసాద్ కోసం పోలీసుల వేట..!
Bhavyas Anand Prasad
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 28, 2021 | 1:49 PM

Bhavyas Anand Prasad : భవ్యాస్ బిల్డర్స్ అధినేత ఆనంద ప్రసాద్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. చీటింగ్‌ కేసులో భవ్యాస్‌ బిల్డర్స్‌ అధినేత ఆనంద ప్రసాద్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన కుమారుడు, కోడలిని అదుపులోకి తీసుకుని… ఆయన కోసం కూపీ లాగుతున్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెనిగండ్ల ఆనంద ప్రసాద్పై రామచంద్రాపురం పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భవ్యా కన్‌స్ట్రక్షన్స్ అధినేత, సినీ నిర్మాత, శేర్‌లింగంపల్లి నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆనందప్రసాద్ తనను మోసం చేశాడంటూ ఫిర్యాదు అందింది. పెట్టుబడి కింద డబ్బులు ఇచ్చిన వ్యక్తిని చంపుతానంటూ బెదిరించినందుకు భవ్యాస్‌ బిల్డర్స్‌ అధినేత ఆనందప్రసాద్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులపై చీటింగ్ కేసు నమోదైంది.

జూపల్లి సత్యనారాయణరావు ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ఆనందప్రసాద్‌ కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు. 2017లో రియల్‌ ఎస్టేట్‌, సిమెంట్‌ పరిశ్రమలో పెట్టుబడి పెట్టాలని జూపల్లి సత్యనారాయణను ఆనందప్రసాద్ రిక్వస్ట్ చేశారు. పెట్టిన పెట్టుబడికి ప్రతి 6 నెలలకు 4 శాతం ప్రాఫిట్‌ చూపుతానని హామీ ఇచ్చారు. ఒక వేళ ఇబ్బంది వస్తే… బాచుపల్లి, దుండిగల్‌, బౌరంపేట ప్రాంతాల్లో భూములు ఉన్నాయని భరోసా ఇచ్చారు ఆనంద్‌ప్రసాద్. వాటిని అమ్మి అమౌంట్ సెటిల్ చేస్తామని నమ్మించారు.

ఈ మాటలు నమ్మిన జూపల్లి సత్యనారాయణ కోటి రూపాయలను చెక్‌ రూపంలో భవ్యాస్‌ కన్‌స్ట్రక్షన్‌ పేరున డిపాజిట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక ఆనంద్‌ప్రసాద్‌ మొహం చాటేశారు. సత్యనారాయణరావుకు ఇచ్చిన హామీని మర్చిపోయారు. ఆయనకు ఇవ్వాల్సిన 4 శాతం లాభాల సంగతి పట్టించుకోలేదు. ఎన్నిసార్లు అడిగినా వాయిదా వేస్తూ వచ్చారు. గట్టిగా అడిగితే చంపుతామంటూ బెదిరించారు.

ఆందోళన చెందిన సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు భవ్యాస్ కన్‌స్ట్రక్షన్ ఛైర్మన్‌ ఆనంద్‌ ప్రసాద్‌ సహా కుటుంబ సభ్యులు, సంస్థ డైరెక్టర్లు వెనిగల ఆధిత్య, వెనిగల కృష్ణకుమారీ, వెనిగల నిఖిల, శివకుమార్‌లపై 420 406, 506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. శనివారం కుమారుడు, కోడలిని కూకట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నట్టు గుర్తించారు. వారికోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఏ క్షణంలోనేనా వాళ్లను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

Read Also…  రసవత్తరంగా సాగర సంగ్రామం.. ఎవరికి వారు సరికొత్త లెక్కలు.. గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్