Cattle Shed Ablaze: మేడిచర్ల పాలెంలో దారుణం.. పశువులపాకకు నిప్పు పెట్టిన తోటికోడళ్లు..
ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో తోటి కోడళ్లకు కొపం వచ్చింది. అర్థరాత్రి నిద్రలేచి పశువుల పాకకు నిప్పుపెట్టారు. దీంతో మంటలు అంటుకుని అగ్ని ప్రమాదం సంభవించి మూగజీవాలు విలవిలలాడాయి.
Cattle Shed Ablaze: ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో తోటి కోడళ్లకు కొపం వచ్చింది. అర్థరాత్రి నిద్రలేచి పశువుల పాకకు నిప్పుపెట్టారు. దీంతో మంటలు అంటుకుని అగ్ని ప్రమాదం సంభవించి మూగజీవాలు విలవిలలాడాయి. ఈ దారుణ సంఘటన మలికిపురం మండలం మేడిచర్ల పాలెంలో చోటుచేసుకుంది.
మేడిచర్ల పాలెంలో తోటి కోడళ్ల మధ్య పంచాయితీ చిలికి చిలికి గాలివానలా మారి.. పశువుల పాకను తగలబెట్టే పరిస్థితిగా వెళ్లింది. కృష్ణ మూర్తి అనే ఆయన కుటుంబంలో తోటి కోడళ్ల మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో ఓ కోడలిపై మిగిలి ఇద్దరు కోడళ్లు పగ తీర్చుకోవాలనుకున్నారు. ఇదే క్రమంలో ఆమె ఇంటి ఆవరణలో ఉన్న పశువుల పాకకు నిప్పు పెట్టారు.
బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కోళ్లు, మేకలు, ఆవులు పెద్దగా అరుస్తూ ఉండడంతో బయటికి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులకు పశువుల శాలలో మంటలు ఒక్కసారిగా ఎగసిపడుతుండటంతో.. కృష్ణ మూర్తి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అగ్నిప్రమాదంలో 23 కోళ్లు, ఒక మేక, కొత్త స్కూటర్ బైక్ అగ్నికి పూర్తిగా కాలిబూడిదయ్యాయి. దీంతో యజమాని వెంటనే మూడు ఆవులకు కట్టిన తాళ్ళు విప్పి వేయడంతో మూగజీవాలు ప్రాణాలతో బయట పడ్డాయి. ఘటనకు సంబంధించి కృష్ణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తోటి కోడళ్ల మధ్య వైరమే పశువుల పాకను తగలబెట్టడానికి కారణమని తేల్చేశారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also… Viral Video: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..