Car Tyres Theft: కాదేదీ దొంగతనానికి కనర్హం అంటున్న మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వింత దొంగలు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో వింత దొంగలు హల్ చల్ చేస్తున్నారు. కార్లకు ఉండాల్సిన చక్రాలు రాత్రికి రాత్రే మాయమవుతున్నాయి. కేటుగాళ్లు కొత్త కొత్త కార్లను టార్గెట్ గా చేసుకుని రోడ్డు పై నిలిపిన కార్ల చక్రాలు ఎత్తుకెళుతున్నారు. ఈ వింత దొంగతనాలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో...
Car Tyres Theft: అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కాదేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ.. తాజాగా ఈ వింత దొంగలు కాదేదీ దొంగతనానికి కనర్హం అంటున్నారు. కార్లకు ఉండాల్సిన చక్రాలు రాత్రికి రాత్రే మాయమవుతున్నాయి. కేటుగాళ్లు కొత్త కొత్త కార్లను టార్గెట్ గా చేసుకుని రోడ్డు పై నిలిపిన కార్ల చక్రాలు ఎత్తుకెళుతున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ వింత దొంగలు హల్ చల్ చేస్తున్నారు.
జిల్లాలో వరసగా జరుగుతున్న వాహనాల చక్రాల చోరీలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో రెడ్డికాలనీలో రోడ్డుపై నిలిపిన కారు చక్రాలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. స్థానిక హైటెక్‌సిటీలో నివాసముంటున్న ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ భరత్ కారు చక్రాలను మాయం చేశారు. ఉదయం చూసే సరికి కారుకు ఉన్న నాలుగు టైర్లు దొంగలు ఎత్తుకెళ్లారు. అది చూసిన బ్యాంక్ ఆఫీసర్ కంగుతిన్నాడు. ఇదే తరహాలో స్థానిక మారుతినగర్‌లో నివాసముంటున్న ఎల్‌ఐసీ ఎజెంట్ రుక్మారావు కారుదీ కూడా అదే పరిస్థితి. రాత్రి ఇళ్లముందు పార్క్ చేసిన కార్లకు తెల్లవారేసరికి టైర్లు లేకపోవటంతో బాధితులు కంగితిన్నారు.
బాధితులిద్దరు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కార్ టైర్ల దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీలను సేకరిస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
Also Read: