Robbery Failed : దొంగతనానికి విఫలయత్నం.. రాజోలులో పట్టపగలు సినిమా ఫక్కీలో చోరీ..!

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Feb 08, 2021 | 10:47 PM

తూర్పుగోదావరి జిల్లా రాజోలులో ఓ దొంగతనానికి విఫలయత్నం జరిగింది. శ్రీ లక్ష్మీశ్రీనివాస జ్యూయలర్స్ షాపులో పట్టపగలు దొంగతనం చేయబోయి ఫెయిలయ్యారు ఘరానా దొంగలు. బంగారు నగల..

Robbery Failed : దొంగతనానికి విఫలయత్నం.. రాజోలులో పట్టపగలు సినిమా ఫక్కీలో చోరీ..!

Follow us on

Robbery Failed : తూర్పుగోదావరి జిల్లా రాజోలులో ఓ దొంగతనానికి విఫలయత్నం జరిగింది. శ్రీ లక్ష్మీశ్రీనివాస జ్యూయలర్స్ షాపులో పట్టపగలు దొంగతనం చేయబోయి ఫెయిలయ్యారు ఘరానా దొంగలు. బంగారు నగల కొనుగోలుదారులుగా దుకాణంలోకి వచ్చారు ఇద్దరు వ్యక్తులు. షాపులో ఓనర్ ఒక్కడే ఉండటం చూసి ఇంక తమ ప్లాన్‌ అమలు చేయడం ప్రారంభించారు. ఊపిరి సలపనివ్వకుండా రకరకాల నగలు చూపించమని అడిగారు.

వాటి బరువు, రేట్లు వగైరాలు అడుగుతూ ఉక్కిరిబిక్కిరి చేశారు. ఒక్కొక్కటిగా ఆ నగలు తీసి ట్రయల్స్ వేశారు. బేరసారాలు సాగిస్తూ పరిసరాలన్నీ జాగ్రత్తగా పరికించారు. ఈ పనులన్నిటితో అతను కాస్త ఏమరుపాటుగా ఉన్నట్టు గమనించారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా అని బేరీజు వేసుకున్నారు. ఒకడు కేజువల్‌గా బయటకు వెళ్లినట్టు వెళ్లాడు.

దుకాణం డోర్ దగ్గర రెండోవాడు రాగానే పరిగెత్తేందుకు వీలుగా నిలబడ్డాడు. మరొకడు తన జేబులో నుండి తుపాకీ తీసి బెదిరించాడు. వెంటనే బయట ఉన్నవాడు డోర్ తెరిచి పట్టుకున్నాడు. యజమాని షాక్ నుంచి తేరుకొనేలోగా లోపల ఉన్న దొంగ ఒక నగల పెట్టెలోని నగలన్నీ ఖాళీ చేసి పారిపోబోయాడు. ఏం జరుగుతుందో గుర్తించిన ఓనర్ వెంటనే ఆ దొంగతో పెనుగులాడి నగలన్నీ లాక్కోగలిగారు. ఇంకా ఓవర్ చేస్తే దొరికిపోతామనుకున్నారేమో ఆ దొంగలు బయటకు పరిగెత్తారు. లోపల సీన్‌ తమకు ఎదురు తిరిగినట్టు గుర్తించిన బయటి దొంగ వాహనం స్టార్ట్ చేశాడు.

తుపాకీ బయటికి తీసిన దొంగ పరుగుపరుగున వాహనం దగ్గరకి పరిగెత్తాడు. అయినా పట్టువీడని ఆ షాప్ ఓనర్‌ దొంగ దొంగ అంటూ డోర్ దగ్గరకి వెళ్లి అరిచాడు. ఈ అరుపులకు బెదిరిన ఆ ఇద్దరు దొంగలు వాహనంపై పరారయ్యారు. ఈ పెనుగులాటలో వాళ్లలో ఒకరి సెల్‌ ఫోన్‌ను షాప్ యజమాని చేజిక్కించుకోగలిగారు. తమ దుకాణంలో జరిగిన చోరీ యత్నంపై షాపు యజమాని రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుని అందుకున్న పోలీసులు కేసుపై దర్యాప్తును మొదలుపెట్టారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu