ల్యాండ్ సెటిల్‌మెంట్‌.. వ్యాపారిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడి గ్యాంగ్‌ వీరంగం

హైదరాబాద్‌లో కడప టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండా రెడ్డి గ్యాంగ్ వీరంగం సృష్టించింది. నగర నడిబొడ్డున ఓ వ్యాపారిని

ల్యాండ్ సెటిల్‌మెంట్‌.. వ్యాపారిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడి గ్యాంగ్‌ వీరంగం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 07, 2020 | 10:51 AM

Business Man alleges: హైదరాబాద్‌లో కడప టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండా రెడ్డి గ్యాంగ్ వీరంగం సృష్టించింది. నగర నడిబొడ్డున ఓ వ్యాపారిని తుపాకులతో బెదిరించి కొండారెడ్డి గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. ఈ క్రమంలో ఆ గ్యాంగ్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ‌శివ గణేష్ అనే వ్యాపారికి కడప జిల్లా ప్రొద్దుటూరులో రెండున్నర ఎకరాల భూమి ఉండగా.. అది వివాదంలో పడింది. ఈ వివాదాన్ని పరిష్కరిస్తామని శివ గణేష్‌కి కొండారెడ్డి హామీ ఇచ్చాడు. రూ.14 కోట్ల విలువైన భూమిని సెటిల్‌మెంట్‌ చేస్తే, ఒక ఎకరం భూమి కొండారెడ్డికి రాసిస్తానని శివ గణేష్ ఒప్పుకున్నాడు. అయితే గత నెల 26న శివగణేష్‌ని తుపాకులతో బెదిరించిన కొండారెడ్డి.. తుపాకీని పాయింట్ బ్లాక్‌లో పెట్టి సంతకాలు చేయించుకున్నాడు. ఆ సమయంలో వరదరాజుల రెడ్డి బంధువు రామచంద్రా రెడ్డి కూడా ఉన్నాడు. ఈ సెటిల్‌మెంట్‌కి వరదరాజులు రెడ్డి గన్‌మెన్లను కొండారెడ్డి వాడుకున్నట్లు సమాచారం. దీనిపై శివ గణేష్ బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించగా.. వారు దర్యాప్తును చేసి 15 మందిపై కేసు నమోదు చేశారు. 452, 341, 386, 502, 120 బి సెక్షన్ల కింద వీరిపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ వివాదంపై మాట్లాడిన వరదరాజులు రెడ్డి.. తన కుమారుడు కొండారెడ్డి మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తారని, ఆ తరువాత అన్ని విషయాలను వెల్లడిస్తాడని చెప్పారు.

Read More:

మాస్‌ రాజా కూడా స్టార్ట్‌ చేసేశాడు

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,154 కొత్త కేసులు.. 8 మరణాలు