AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసును‌ చేధించిన‌ పోలీసులు

కృష్ణా జిల్లా విసన్నపేట ట్రిపుల్‌ మర్డర్‌ కేసును ఛేదించారు పోలీసులు. నిందితులైన వెంకన్న, నాగమణి దంపతులతో పాటు వారి కొడుకును అరెస్ట్‌ చేశారు.

సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసును‌ చేధించిన‌ పోలీసులు
Balaraju Goud
|

Updated on: Oct 06, 2020 | 10:11 PM

Share

కృష్ణా జిల్లా విసన్నపేట ట్రిపుల్‌ మర్డర్‌ కేసును ఛేదించారు పోలీసులు. నిందితులైన వెంకన్న, నాగమణి దంపతులతో పాటు వారి కొడుకును అరెస్ట్‌ చేశారు. వారి నుంచి ఆటోతో పాటు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పశ్చిమగోదావరి జిల్లా చిలకలపూడికి చెందిన వారిగా గుర్తించారు. రెక్కీ నిర్వహించి హత్యలకు పాల్పడ్డాట్లు పోలీసులు తెలిపారు.

విస్సన్నపేటలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. అయితే అది ప్రమాదం కాదు.. ట్రిపుల్ మర్డర్‌ అని పోలీసుల విచారణలో తేలింది. రోడ్డు ప్రమాదంగా క్రియేట్ చేసి ముగ్గుర్ని హత్య చేశారు వెంకన్న దంపతులు. కేసు వివరాలు పోలీసులు మీడియాకు వెల్లడించారు. మృతుడు చిన్నస్వామి భార్యతో దాసరి వెంకన్నకు వివాహేతర సంబంధం ఉందని తేల్చారు. దీంతో చిన్నస్వామి, దాసరి వెంకన్న మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అతణ్ని చంపేయాలని దాసరి వెంకన్న ప్లాన్‌ చేశాడని చెప్పారు. చినస్వామికి మద్యం తాగించి హత్యలకు కుట్ర పన్నారని పోలీసులు వివరించారు.

నూజివీడు వెళ్దామని చిన్నస్వామి దంపతులతోపాటు వారి కూతురుని ఆటోలో తీసుకెళ్లారు దాసరి వెంకన్న దంపతులు. దారి మధ్యలోనే వారిని హతమార్చి… రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి, తప్పించుకుందామనుకున్నారు. ముచ్చినపల్లి మామిడి తోట వద్దకు రాగానే ఆటో ఆపి చినస్వామిపై మారణాయుధాలతో దాడి చేశాడు వెంకన్న. అది చూసి పారిపోతున్న భార్య తిరుపతమ్మను రాడ్డుతో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతుల కుమార్తెను గొంతు బిగించి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఆటో కల్వర్ట్‌ను ఢీ కొట్టడంతో యాక్సిడెండ్‌ జరిగిందని మొదట అందరిని నమ్మించారు. నిందితుల నుండి ఆటోను, మారణాయుధాలు, దుస్తులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పోలీసులకు దొరికిన క్లూస్‌ ఆధారంగా గంటల వ్యవధిలోనే ట్రిపుల్‌ మర్డర్‌ కేసును ఛేదించారు.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల