AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suicide: ఇంటి ముందు అప్పులు ఇచ్చిన వాళ్ల గొడవ.. మనస్తాపానికి గురై ఇంటి యజమాని ఆత్మహత్య..!

Suicide: అప్పుల వాళ్లు ఇంటి ముందు గొడవకు దిగడంతో మనస్థాపానికి గురైన ఓ వ్యాపారి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కళ్లెదుటే కన్నతండ్రి మంటల్లో..

Suicide: ఇంటి ముందు అప్పులు ఇచ్చిన వాళ్ల గొడవ.. మనస్తాపానికి గురై ఇంటి యజమాని ఆత్మహత్య..!
Subhash Goud
|

Updated on: Jan 31, 2022 | 6:36 AM

Share

Suicide: అప్పుల వాళ్లు ఇంటి ముందు గొడవకు దిగడంతో మనస్థాపానికి గురైన ఓ వ్యాపారి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కళ్లెదుటే కన్నతండ్రి మంటల్లో ఆహుతై పోతుంటే అది చూసిన కన్నబిడ్డలు తల్లడిల్లిపోయారు. ఒకవైపు కలిసిరాని కాలం, మరోవైపు కనికరం లేని కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన వ్యాపారిని అప్పులు ఇచ్చిన వాళ్లు వేధించడంతో అవమాన భారం తట్టుకోలేక ఇంటి ఎదుట కుటుంబ సభ్యుల సమక్షంలోనే అగ్నికి ఆహుతైన సంఘటన కలకలం రేపింది. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మడనూరులో నూతలపాటి సురేష్ అప్పులోళ్ళ ఒత్తిడి తట్టుకోలేక అతహత్య చేసుకున్న ఘటన గ్రామంలో అలజడి రేపింది. సురేష్ కు సొంతంగా లారీ ఉంది. అన్నమయ్య ఐస్ ఫ్యాక్టరీ లో ఐస్ కొనుగోలు చేసి రొయ్యల వ్యాపారులకు బాడుగకు పెడుతుంటాడు. ఏడాది క్రితం లారీ రోడ్డు ప్రమాదానికి గురవడంతో అన్నమయ్య ఐస్ ఫ్యాక్టరీ లో పనిచేసే అరవపల్లి సుకేష్ వద్ద 3 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు.

అనంతరం కరోనా కారణంగా బాడుగలు లేకపోవడంతో లారీని నెల్లూరు బాబుకు లీజ్‌కు ఇచ్చాడు. అయితే లారీని తానే కొనుగోలు చేస్తానని చెబుతూ రేటు తేల్చకుండా బాబు తాత్సారం చేశాడు. మరో వైపు కుటుంబానికి పెద్ద దిక్కు అయిన ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న తండ్రి శ్రీరాములు కరోనాతో కన్నుమూశాడు. దీంతో సురేష్ షుగర్ వ్యాది ఎక్కువై ఆరోగ్యం కూడ దెబ్బతింది. ఈ నేపథ్యంలో అటు లారీ అమ్ముకోలేక, ఇటు సుకేశ్ కు డబ్బులు చెల్లించలేక మదన పడుతున్నాడు. అయితే సుకేష్ వెంటవెంటనే బాకీ కోసం ఒత్తిడి పెంచడంతో సుకేష్‌, అతనితోపాటు బాకీవసూలు కోసం వచ్చిన వ్యక్తులు ముందే ఇంట్లో ఉన్న పెట్రోల్ తో ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఇంట్లో ఉన్న కుమార్తె పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి రిమ్స్ హాస్పటల్ కి తరలించారు. రిమ్స్ లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరణ వాంగ్మూలం కుడా ఇచ్చాడు. కుటుంబ సభ్యులు మాత్రం సుకేష్ కారణంగానే సురేష్ ఆత్మహత్య చేసుకున్న ట్లు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి:

Road Accident: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..

Rajasthan: ఆయిల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా నలుగురు దుర్మరణం..