Crime News: మృత్యుపాశంగా మారిన డోర్ కర్టన్.. గొంతుకు బిగుసుకొని బాలుడు మృతి..
Medchal Malkajgiri: ఇంట్లో ఉన్న చిన్నారులంతా సరదాగా ఆడుకుంటున్నారు. దీంతో ఇంట్లో సందడి నెలకొంది. ఈ క్రమంలో డోర్ కర్టన్ బాలుడకి మృత్యుపాశంగా
Medchal Malkajgiri: ఇంట్లో ఉన్న చిన్నారులంతా సరదాగా ఆడుకుంటున్నారు. దీంతో ఇంట్లో సందడి నెలకొంది. ఈ క్రమంలో డోర్ కర్టన్ బాలుడకి మృత్యుపాశంగా మారడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటన తెలంగాణ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ఇద్దరు చెల్లెళ్లతో కలిసి ఆడుకుంటున్న బాలుడికి.. అకస్మాత్తుగా డోర్ కర్టెన్ ఉరితాడుగా మారిన విషాదకర సంఘటన జిల్లాలోని ఘట్‌కేస్‌ర్ పట్టణంలో జరిగింది. ఇన్స్‌స్పెక్టర్ ఎన్ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్ పట్టణం బ్రుక్‌బాండ్ కాలనీలో సామల శ్రీనివాస్, శాంతి దంపతులు నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్ టీవీ మెకానిక్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా.. భార్య శాంతి స్థానిక హాస్టల్‌లో వంట పనులు చేస్తూ ఉంటుంది. వీరికి కుమారుడు భార్గవ్(11) మరో ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
అయితే.. ముగ్గురూ కలిసి ఇంట్లో గురువారం సరదాగా ఆటలాడుకుంటున్నారు. ఈ క్రమంలో డోర్ కర్టన్ గొంతుకు బిగుసుకు పోవడంతో బాలుడు మృతిచెందాడు. అప్పటివరకు సందడిగా ఉన్న ఇంట్లో బాలుడు మరణించడంతో.. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: