సినీ ఫక్కీలో బాలుడి కిడ్నాప్..
తూర్పుగోదావరి జిల్లాలో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. సినిమా ఫక్కీలో బాలుడి కిడ్నాప్ తర్వాత దుండగులు క్షణాల్లో మాయమయ్యారు. మండపేటలోని విజయలక్ష్మీనగర్ లో నానమ్మతో కలిసి ఆడుకుంటున్నాడు బాలుడు జశ్వత్. అదే సమయంలో ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చిన ఆమెను కొట్టి బాలుడిని ఎత్తుకెళ్లారు. అక్కడే ఉన్న స్థానికులు వాళ్లని చాలా దూరం వెంబడించారు. అయిన్పటికీ ఫలితం లేకుండా పోయింది. జశ్వత్ తల్లిదండ్రులు ఇద్దరూ బ్యాంక్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. కిడ్నాప్ చేసిన ఆగంతకులు ఇప్పటికవరకు […]
తూర్పుగోదావరి జిల్లాలో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. సినిమా ఫక్కీలో బాలుడి కిడ్నాప్ తర్వాత దుండగులు క్షణాల్లో మాయమయ్యారు. మండపేటలోని విజయలక్ష్మీనగర్ లో నానమ్మతో కలిసి ఆడుకుంటున్నాడు బాలుడు జశ్వత్. అదే సమయంలో ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చిన ఆమెను కొట్టి బాలుడిని ఎత్తుకెళ్లారు. అక్కడే ఉన్న స్థానికులు వాళ్లని చాలా దూరం వెంబడించారు. అయిన్పటికీ ఫలితం లేకుండా పోయింది. జశ్వత్ తల్లిదండ్రులు ఇద్దరూ బ్యాంక్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. కిడ్నాప్ చేసిన ఆగంతకులు ఇప్పటికవరకు డబ్బుకోసం గాని, మరే ఇతర డిమాండ్‌తో గానీ ఫోన్ చేయలేదు. దీంతో.. ఇది అయిన వాళ్లే చేశారా.. లేదంటే ఎవరైనా పథకం ప్రకారం కక్షసాధింపుతో చేశారా అన్నది అంతు చిక్కడం లేదు. మరోవైపు పోలీసులు బృందాలుగా విడిపోయి.. బాలుడి కోసం గాలిస్తున్నారు.