షాకింగ్.. కుళ్లిన స్థితిలో ఎయిర్ హోస్టెస్ శవం..!
దేశ వ్యాప్తంగా కరోనాతో ప్రజలు గజగజ వణికిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబైలో ఓ ఎయిర్ హోస్టెస్ యువతి మృతి కలకలం రేపుతోంది. తన సొంత అపార్ట్‌మెంట్‌లో కుళ్లిపోయిన స్థితిలో శవమై ఉండటంతో.. స్థానికులు వణికిపోతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. సుల్తానా షైక్ అనే ఓ యువతి ఓ విమాన సంస్థలో ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తోంది. తనతో పాటు మరో ఇద్దరు సహోద్యోగులు కూడా.. ముంబైలోని పోద్దార్ వాడి ప్రాంతంలో నివసిస్తోన్నారు.అయితే దేశ వ్యాప్తంగా […]

దేశ వ్యాప్తంగా కరోనాతో ప్రజలు గజగజ వణికిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబైలో ఓ ఎయిర్ హోస్టెస్ యువతి మృతి కలకలం రేపుతోంది. తన సొంత అపార్ట్‌మెంట్‌లో కుళ్లిపోయిన స్థితిలో శవమై ఉండటంతో.. స్థానికులు వణికిపోతున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సుల్తానా షైక్ అనే ఓ యువతి ఓ విమాన సంస్థలో ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తోంది. తనతో పాటు మరో ఇద్దరు సహోద్యోగులు కూడా.. ముంబైలోని పోద్దార్ వాడి ప్రాంతంలో నివసిస్తోన్నారు.అయితే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించక ముందే.. తన ఇద్దరు స్నేహితులు ముంబై విడిచి వెళ్లిపోయారు. దీంతో అప్పటి నుంచి తన గదిలో ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో బుధవారం రోజు తన గది నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే విషయాన్ని పోలీసులకు చేరవేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గదిని తెరచి చూసే సరికి షాక్ తిన్నారు. కుళ్లిపోయిన స్థితిలో పడి ఉన్నయువతి మృతదేహాన్ని గుర్తించారు. గదిలో ఎక్కడా కూడా ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. దీంతో యాక్సిడెంటల్ డెత్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.