గోడకు రంద్రం..మద్యం మాయం..
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో వైన్ షాపులు, బార్లు మూత పడడంతో మద్యం దొరకడం లేదు. దీంతో మద్యానికి భారీగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో కొంత మంది వైన్స్ యజమానులు,సిబ్బంది బ్లాకులో మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం న్యూ టౌన్ చౌరస్తాలోని గోకుల్ వైన్స్‌లో ఇదే తరహాలో మద్యం మాయమైంది. దుకాణం వెనక నుంచి గోడకు రంధ్రం వేసి.. లక్షల రూపాయల విలువైన మద్యం చోరీ […]

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో వైన్ షాపులు, బార్లు మూత పడడంతో మద్యం దొరకడం లేదు. దీంతో మద్యానికి భారీగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో కొంత మంది వైన్స్ యజమానులు,సిబ్బంది బ్లాకులో మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం న్యూ టౌన్ చౌరస్తాలోని గోకుల్ వైన్స్‌లో ఇదే తరహాలో మద్యం మాయమైంది. దుకాణం వెనక నుంచి గోడకు రంధ్రం వేసి.. లక్షల రూపాయల విలువైన మద్యం చోరీ చేశారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరా టీవీల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనక వైన్స్ యజమాని హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.




