‘ఆచార్య’పై కొరటాల ఆసక్తికర వ్యాఖ్యలు.. చిరు మూవీ ఎలా ఉండబోతుందంటే..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ఆచార్య. ఇప్పటి వరకు కొరటాల శివ తెరకెక్కించిన అన్ని మూవీలు ఘన విజయాలు సాధించడంతో..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ఆచార్య. ఇప్పటి వరకు కొరటాల శివ తెరకెక్కించిన అన్ని మూవీలు ఘన విజయాలు సాధించడంతో.. చిరు ప్రాజెక్ట్‌పై అటు అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉండబోతుందని చిరంజీవి పలుమార్లు ఇప్పటికే వెల్లడించారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కొరటాల శివ ఆచార్యపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమా ఎలా ఉండబోతుందన్న ప్రశ్నకు.. తన పంథా సామాజిక అంశాలతో పాటు చిరంజీవి మాస్ ఇమేజ్ కలిస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రం అలానే ఉండబోతుందని ఆయన చెప్పారు. చిరంజీవి కోసం ఒక పవరఫుల్ పాత్రను డిజైన్ చేశానని.. ఆ పాత్ర ప్రేక్షకులపై తప్పకుండా ప్రభావం చూపిస్తుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. దీంతో సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు కొరటాల. కాగా ఈ చిత్రంలో చిరంజీవి నక్సలైట్‌గా, ప్రొఫెసర్‌గా రెండు పాత్రల్లో నటించబోతున్నారు. రామ్ చరణ్, సోనూసూద్, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Read This Story Also: తెరుచుకున్న సర్కార్ బడి…మాస్క్‌లతో విద్యార్థులు