Mynampally Hanumantha Rao: అర్ధరాత్రి ఎమ్మెల్యే మైనంపల్లి ఇంటి ముందు హైడ్రామా.. బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తల అరెస్ట్
హైదరాబాద్ కొంపల్లిలోని ధూలపల్లిలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. బీజేపీ మహిళా కార్యకర్తలు మైనంపల్లి ఇంటివద్ద ఆందోళనకు దిగారు.
Malkajgiri MLA Mynampally Hanumantha Rao: హైదరాబాద్ కొంపల్లిలోని ధూలపల్లిలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. బీజేపీ మహిళా కార్యకర్తలు మైనంపల్లి ఇంటివద్ద ఆందోళనకు దిగారు. మైనంపల్లి ఇంటిపై కోడిగుడ్లు విసిరేందుకు యత్నించారు. అయితే, వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.
నిన్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చెలరేగిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. కార్పొరేటర్ శ్రవణ్‌పై దాడి ఘటనతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అది కాస్తా చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో ఆదివారం రాత్రి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంటి వద్ద మహిళలు గొడవకు దిగారు. మైనంపల్లి ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరేందుకు బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు వారిని నివారించేందుకు యత్నించడంతో తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది.
టీఆర్‌ఎస్ శ్రేణుల దాడిలో గాయపడిన శ్రవణ్‌ను పరామర్శించిన బండి సంజయ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో బండి సంజయ్‌ను తీవ్ర పదజాలంతో ధూషించారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. దీంతో రగిలిపోయిన బీజేపీ మహిళా కార్యకర్తలు ధూలపల్లిలోని మైనంపల్లి ఇంటివద్ద ఆందోళనకు దిగారు. అయితే, వారిపై మైనంపల్లి పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారని ఆరోపిస్తున్నారు బీజేపీ మహిళా కార్యకర్తలు. మహిళల దాడిపై సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మరోవైపు, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
లక్ష్యం 78.. కానీ, 19 పరుగులకే ఆలౌట్.. 5గురు బ్యాట్స్‌మెన్స్ జీరోకే పెవిలియన్.. ఎక్కడో తెలుసా?