Crime News: బీహార్‌లో సెక్స్ రాకెట్ కలకలం.. లిస్టులో ప్రముఖుల పేర్లు!!
బీహార్‌లోని గయా జిల్లాలో హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఈ రాకెట్‌లో 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు వాట్స్‌గ్రూప్, సోషల్ మీడియాల ద్వారా అమ్మాయిల చిత్రాలను ...
Bihar Prostitution Racket: బీహార్‌లోని గయా జిల్లాలో హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఈ రాకెట్‌లో 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు వాట్సాప్ గ్రూప్స్, సోషల్ మీడియా ఖాతాల ద్వారా అమ్మాయిల చిత్రాలను పంపేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకునేవారు. ఆ తర్వాత అమ్మాయిలను పిలిపించుకునేవారు. ఈ వ్యవహారంలో గయాతో పాటు పాట్నా, సమీప జిల్లాల నుంచి చాలా మంది భాగస్వాములుగా ఉన్నట్లు సమాచారం. బీహార్‌కు చెందిన బోధ్‌గయా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిమ హోటల్ పక్కనే ఉన్న బినామీ గెస్ట్ హౌస్‌లో ఈ సెక్స్ రాకెట్ నిశ్శబ్దంగా నడుస్తోంది. కోల్‌కతా నుండి అమ్మాయిలను కాంట్రాక్ట్‌పై తీసుకువచ్చి, ఇక్కడ అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
మహిమ హోటల్ పక్కనే ఉన్న ఓ గెస్ట్‌హౌస్‌కు గుర్తు తెలియని వ్యక్తులు నిత్యం వస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన గయా పోలీసులు సదరు హోటల్‌పై దాడి చేసి, ఆపరేటర్‌తో పాటు 14 మందిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా సెక్స్ రాకెట్‌లో ఇరుక్కున్న ఇద్దరు బాలికలను కూడా పోలీసులు రక్షించారు. నిందితుల నుంచి మొత్తం 16 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు గయా పోలీసులు తెలిపారు. ఆపరేటర్ మొబైల్ ఫోన్‌లో సుమారు 15 వందలకు పైగా కస్టమర్ల కాంటాక్ట్ నంబర్లు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ లిస్ట్‌లో గయాకు చెందిన ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. వారిని గుర్తించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదిత్య కుమార్ మీడియాకు తెలిపారు. కాగా ఈ వ్యవహారంపై పోలీసులు మరికొద్ది రోజుల్లో పెద్దఎత్తున ఉక్కుపాదం మోపనున్నారు.
Also Read: Crime News: ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు అరెస్ట్! బాటసారులను అడవిలోకి లాక్కెళ్లి..