AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: నడిరోడ్డుపై యువకుడి గొంతు కోసి హతమార్చేందుకు యత్నం.. పోలీసుల ఏంట్రీతో అసలు నిజం..!

ఒంగోలులో దారుణం జరిగింది... యువకుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి గొంతు కోశాడు.. గొంతు కోశాడు.. ఆ తర్వాత మూడుసార్లు కత్తితో కడుపులో పొడిచాడు..

Crime News: నడిరోడ్డుపై యువకుడి గొంతు కోసి హతమార్చేందుకు యత్నం.. పోలీసుల ఏంట్రీతో అసలు నిజం..!
Murder News
Balaraju Goud
|

Updated on: Jan 22, 2022 | 6:41 PM

Share

Ongole Attempt to Murder case: ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది… కాశి కుమార్ అనే యువకుడిపై రబ్బాని అనే వ్యక్తి కత్తితో దాడి చేసి గొంతు కోశాడు.. ఆ తర్వాత మూడుసార్లు కత్తితో కడుపులో పొడిచాడు.. దీంతో తీవ్ర రక్తస్రావమై కాశి కుమార్ అపస్మారక స్థితికి వెళ్లి పోయాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితుడిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక బృందాలు సకాలంలో స్పందించి నిందితుడు రబ్బానిని పట్టుకున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్యాయత్నం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

ఒంగోలులోని 60 అడుగుల రోడ్డులో సాయి వీణ హాస్పిటల్ దగ్గర రబ్బాని తన భార్యతో కలిసి టీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. ఈ నేపథ్యంలో రబ్బానీ దగ్గర పని చేస్తున్న కాశి కుమార్ అనే యువకుడు రబ్బానీ భార్యపై కన్నేశాడు. ఆమెను లోబరుచుకుని 6 నెలల క్రితం ఇద్దరూ కలిసి పారిపోయారు. అప్పటి నుంచి కాశి కుమార్‌పై కోపంతో రగిలిపోతున్న రబ్బాని ఇద్దరి కోసం గాలిస్తున్నాడు. ఈ సందర్భంలో కాశి కుమార్ గుంటూరు రోడ్ లోని బడ్డీ కొట్టు దగ్గర కనిపించడంతో కట్టలు తెంచుకున్న ఆవేశంతో రబ్బాని కత్తితో కాశీకుమార్ పై దాడి చేశాడు. గొంతు కోసి అనంతరం కడుపులో మూడుసార్లు పొడిచాడు. ఈ దాడిలో కాశీ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలంలోనే నిందితుడు రబ్బానిని పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ కాశి కుమార్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ చేస్తున్నామని ఒంగోలు తాలూకా శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Read Also….  Covid 19: కరోనా మహమ్మారి పూర్తిగా అంతం కాకపోవచ్చు.. అయినా ప్రమాదం లేదంటున్న నిపుణులు

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్