Bhuma Akhila Priya : కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియకు బిగ్ షాక్.. కౌంటర్‌ కాపీలో సంచలన అంశాలు..

పిటిషనర్‌కు నేర చరిత్ర ఉందని, ఆమె కుటుంబానికి ఫ్యాక్షన్‌ నేపథ్యం ఉందని చెప్పారు. కిడ్నాప్‌ కేసు నిందితులను దోపిడీదారులుగా పరిగణించాలన్న పోలీసులు.. కేసు నుంచి తప్పించుకునేందుకు వారు మరిన్ని నేరాలకు పాల్పడే...

Bhuma Akhila Priya : కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియకు బిగ్ షాక్.. కౌంటర్‌ కాపీలో సంచలన అంశాలు..
Follow us

|

Updated on: Jan 19, 2021 | 6:01 AM

ఏ 2 నుంచి ఏ 1..‌. ఇప్పుడేకంగా డెకాయిట్‌ కేసు. సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో.. అఖిలప్రియకి బెయిల్‌ దొరకడం లేదు. అఖిలప్రియపై అదనపు సెక్షన్లు నమోదుచేసినట్లు కోర్టులో మెమో దాఖలు చేశారు. IPC సెక్షన్ 395 డెకాయిట్ కేసు నమోదుకావటంతో.. తీవ్రమైన అభియోగాల కేసులు తమ పరిధిలోకి రావంటూ సికింద్రాబాద్ కోర్టు బెయిల్‌ పిటిషన్‌ రిటన్‌ చేసింది.

దీంతో అఖిలప్రియ న్యాయవాదులు నాంపల్లి కోర్టు తలుపుతట్టారు. కిడ్నాప్‌కేసులో అఖిలప్రియ దంపతుల ప్రమేయంపై పక్కా ఆధారాలు ఉండటంతో.. ఆమెకి బెయిల్‌ ఇవ్వొద్దని కోర్టుని కోరారు పోలీసులు. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో కౌంటర్‌ దాఖలుచేశారు. కౌంటర్‌ కాపీలో సంచలన అంశాలను పోలీసులు ప్రస్తావించారు.

పిటిషనర్‌కు నేర చరిత్ర ఉందని, ఆమె కుటుంబానికి ఫ్యాక్షన్‌ నేపథ్యం ఉందని చెప్పారు. కిడ్నాప్‌ కేసు నిందితులను దోపిడీదారులుగా పరిగణించాలన్న పోలీసులు.. కేసు నుంచి తప్పించుకునేందుకు వారు మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని కౌంటర్‌లో తమ వాదన వినిపించారు.

మరోవైపు కిడ్నాప్‌ కేసులో కీలక నిందితుడైన అఖిలప్రియ భర్త అజ్ఙాతంలో ఉంటూనే… ముందస్తు బెయిల్‌ ప్రయత్నాల్లో ఉన్నారు. నాంపల్లి కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్‌కోసం ఆయన లాయర్లు పిటిషన్ వేశారు. కేసులో A3గా ఉన్న భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై.. బోయినపల్లి పోలీసులు కౌంటర్‌ వేయబోతున్నారు. గురువారం రోజు 6వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ముందుకు భార్గవ్‌రామ్‌ బెయిల్‌ పిటిషన్ విచారణకు రానుంది. మరోవైపు అఖిలప్రియ డ్రైవర్‌, పీఏ సహా ముగ్గురి కస్టడీ కోసం పిటిషన్‌ వేశారు పోలీసులు.

ఇవి కూడా చదవండి :

గంజాయి తరలింపుకు గాడిదలు, గుర్రాలు.. స్మగ్లర్ల కొత్త దారులు.. పోలీసుల డ్రోన్‌ కెమెరాలకు చిక్కిన దిమ్మతిరిగే విజువల్స్‌..

అష్టదిగ్బంధనంలో వాషింగ్టన్.. అమెరికా పార్లమెంట్ భవనం సమీపంలో ఆంక్షలు.. బయటి వ్యక్తులకు నో ఎంట్రీ