గంజాయి తరలింపుకు గాడిదలు, గుర్రాలు.. స్మగ్లర్ల కొత్త దారులు.. పోలీసుల డ్రోన్ కెమెరాలకు చిక్కిన దిమ్మతిరిగే విజువల్స్..
విశాఖ మన్యంలో గంజాయి స్మగ్లర్లు సరికొత్త అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. గిరిజనులను గంజాయి కొరియర్లుగా మార్చుకుంటున్నారు. వారితో రకరకాల మార్గాల్లో గంజాయిని తరలిస్తున్నారు. ఇప్పుడు విశాఖ జిల్లా పోలీసుల డ్రోన్...
Cannabis Smugglers : విశాఖ మన్యంలో గంజాయి స్మగ్లర్లు సరికొత్త అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. గిరిజనులను గంజాయి కొరియర్లుగా మార్చుకుంటున్నారు. వారితో రకరకాల మార్గాల్లో గంజాయిని తరలిస్తున్నారు. ఇప్పుడు విశాఖ జిల్లా పోలీసుల డ్రోన్ కెమెరాలకు దిమ్మతిరిగే విజువల్స్ కంటపడ్డాయి. విశాఖ మన్యంలో యథేచ్చంగా గంజాయి పెంపకం సాగుతోంది. దానికి తోడు సరికొత్త మార్గాల్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు తేల్చారు.
ఇప్పటివరకు గంజాయిని ఎండబెట్టి తరలించేవారు. ఇటీవల చాక్లెట్లు, లిక్విడ్ రూపంలోనూ దర్శనమిచ్చింది. ఇప్పుడు దుస్తుల్లో సీక్రెట్‌గా గంజాయిని తరలించడం కంటపడింది. సాధారణంగా ఏపీ, ఒడీషా బార్డర్‌లో ఎలాంటి వస్త్ర వ్యాపారం సాగడంలేదు. కాని మన్యం నుంచి చీరలు, దుస్తులను వ్యాపారులు భారీగా పట్టుకెళ్తుండడం పోలీసులకు డౌట్ వచ్చింది. చీరల్లో గంజాయిని ఉంచి.. ఈ విధంగా వాటిని తిప్పి సంచుల్లో ఇరికించి స్మగ్లింగ్ చేస్తున్నారు.
చీరలు, చున్నీల్లో చుట్టి పంపితే.. ఎవరికీ డౌట్ రాదని ప్లాన్ వేశారు. కాని పోలీసులు వీరి ఆగడాలని కనిపెట్టేశారు. వస్త్రాల రూపంలో ఓ ప్రాంతంలో నుంచి మరో ప్రాంతానికి తరలిస్తుండగా.. పట్టుకున్నారు. కొందరైతే రహదారుల నుంచి కాకుండా.. గాడిదలు, గుర్రాలపై మూటలు పెట్టి.. నదులు, వాగులు, వంకలు దాటిస్తున్నారు. వీరంతా కొరియర్లు మాత్రమే.. అసలు సూత్రధారులు వేరే ఉన్నారు. వాళ్లు తప్పించుకు తిరుగుతుండడంతో.. కేసులు గిరిజనులపై పడుతున్నాయి.