Accident : ప్రమాదవశాత్తు భార్య పైకి కారు ఎక్కించిన భర్త.. అక్కడికక్కడే మరణించిన మహిళ
దుబాయ్ లో జరిగిన ఓ ప్రమాదంలో భారతీయ మహిళ మృతిచెందింది. యూఏఈలోని అజ్మన్ ఎమిరేట్‌లో కారు పార్క్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది...
Accident : దుబాయ్ లో జరిగిన ఓ ప్రమాదంలో భారతీయ మహిళ మృతిచెందింది. యూఏఈలోని అజ్మన్ ఎమిరేట్‌లో కారు పార్క్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లిజి, ఆమె భర్త వైద్య పరీక్షల కోసం శనివారం కమ్యూనిటీ ఆసుపత్రికి వెళ్లారు. లిజి భర్త కారు పార్క్ చేస్తుండగా, ఆమె బయట ఉంచి సూచనలు చేస్తున్నారు. అయితే ప్రమాదవశాత్తు కారు లిజివైపు దూసుకువెళ్లింది. వేగంగా కారు ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. చనిపోయిన ఆమె కేరళకు చెందిన మహిళ అని తెలుస్తుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :